అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా కేసులో ఎన్‌ఐఏ ఛార్జ్‌షీట్‌ | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా కేసులో ఎన్‌ఐఏ ఛార్జ్‌షీట్‌

Published Sun, Feb 4 2024 6:32 PM

NIA charge sheets Three Myanmar people Human Trafficking Case - Sakshi

హైదరాబాద్‌: అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ముగ్గురు మయన్మార్ దేశస్తులుపై చార్జిషీట్ దాఖలు చేసింది. బంగ్లాదేశ్ సరిహద్దుల నుంచి అక్రమంగా భారత్‌లోకి మయన్మార్ దేశస్తులు చొరబడ్డారు. మయన్మార్‌కు చెందిన నిందితులు.. రబి ఇస్లామ్, షఫీ అలం, మహమ్మద్ ఉస్మాన్‌.. రోహింగ్యాలతో వివాహం పేరుతో బంగ్లాదేశ్‌ యువతులకు వల వేశారు.

నకిలీ పత్రాలతో ఇక్కడ ఆధార్ కార్డులను సైతం నిందితులు పొందారు. ఆధార్ కార్డులతో తమ పేరుతో సిమ్ కార్డులు విక్రయించారు. నిందితులు బ్యాంకు ఖాతాలను సైతం తెరవటం గమనార్హం. గత ఏడాది నవంబర్ 7న ఎన్‌ఐఏ కేసు నమోదు చేసింది.

పలువురు ట్రాఫికర్లు, రోహింగ్యలతో  కలిసి మయన్మార్‌ నిందితులు అక్రమంగా భారత్‌లోకి చొరబడ్డారు. బంగ్లాదేశీ రెఫ్యుజీ క్యాంపులో ఉన్న మహిళలను భారత్‌లోకి దింపిందీ ముఠా. తెలంగాణ, యూపీ, రాజస్థాన్‌, హర్యానా, జమ్మూ కాశ్మీర్‌లో ఉన్న రోహింగ్యాలతో వివాహం పేరుతో బంగ్లాదేశ్ యువతులకు వల విసిరింది.

Advertisement
 
Advertisement