రెండో రోజే ఆగిన పెళ్లి కొడుకు గుండె  | Newly Married Groom Deceased With Heart Stroke In Sangareddy | Sakshi
Sakshi News home page

రెండో రోజే ఆగిన పెళ్లి కొడుకు గుండె 

May 26 2021 4:49 AM | Updated on May 26 2021 4:54 AM

Newly Married Groom Deceased With Heart Stroke In Sangareddy - Sakshi

హత్నూర (సంగారెడ్డి): పెళ్లి జరిగిన రెండు రోజులకే పెళ్లి కుమారుడి గుండె ఆగింది.ఈ ఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండల కేంద్రమైన మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కడల అశోక్‌ (24)కు ఆందోల్‌ మండలం ముద్‌మాణిక్‌ గ్రామానికి చెందిన శ్రావణితో ఆదివారం వివాహం జరిగింది. సోమవారం సంప్రదాయ ప్రకారం పెళ్లి అనంతరం జరగాల్సిన తంతును సైతం పూర్తి చేశారు. మంగళవారం ఉదయం ఒక్కసారిగా అశోక్‌ ఛాతీలో నొప్పి వస్తుందంటూ వాంతులు చేసుకున్నాడు. వెంటనే కుటుంబ సభ్యులు సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అశోక్‌ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement