రజకాభివృద్ధి సంస్థ వ్యవస్థాపకుడు అంజయ్య కన్నుమూత  | Sakshi
Sakshi News home page

రజకాభివృద్ధి సంస్థ వ్యవస్థాపకుడు అంజయ్య కన్నుమూత 

Published Tue, Dec 28 2021 2:43 AM

National Founder of Raja Kabhi Vriddhi Sanstha Anjaiah Passed Away - Sakshi

కవాడిగూడ: టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, రజకాభివృద్ధి సంస్థ జాతీయ వ్యవస్థాపకులు డాక్టర్‌ ఎం.అంజయ్య (78) గుండెపోటుతో కన్నుముశారు. తీవ్ర అస్వస్థతకు గురైన డాక్టర్‌ ఎం. అంజయ్య బంజారాహిల్స్‌ కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఒంగోలు జిల్లాకు చెందిన డాక్టర్‌ ఎం.అంజయ్య రజకాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసి ఉమ్మడి ఏపీలో అనేక కార్యక్రమాలను చేపట్టారు.

రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్‌తో దేశవ్యాప్త ఉద్యమం చేసి అసెంబ్లీలో తీర్మానానికి ఒత్తిడి తెచ్చారు. రజకాభివృద్ధి సంస్థ ఏర్పాటుతో పాటు, నిరుపేద రజకులకు ఇళ్లనిర్మాణం, దోబిఘాట్ల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. దివంగత వైఎస్‌ఆర్‌ హయాంలో టీటీడీ బోర్డు మెంబర్‌గా నియమితులయ్యారు.

ఆలిండియా సాయిసే వా సమాజ్‌ అధ్యక్షులుగా కొనసాగుతూ లోయర్‌ ట్యాంక్‌బండ్‌ ద్వారకా నగర్‌లో శ్రీ షిరిడి సాయిబాబా ఆలయాన్ని నిర్మించారు. అంజ య్య మృతిపట్ల  కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో పాటు పలు బీసీ, రజక సంఘాల నేతలు దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. అనంతరం బన్సీలాల్‌పేట హిందూ శ్మశాన వాటికలో దహన సంస్కారాలు నిర్వహించారు.   

Advertisement

తప్పక చదవండి

Advertisement