
సాక్షి, జనగామ: గ్రామాల్లో పంటలను నాశనం చేస్తున్న అడవి పందులను చంపడంతో పాటు తినే హక్కును కూడా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇవ్వాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి డిమాండ్ చేశారు. జనగామలో శనివారం ఆయన మాట్లాడారు. ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, బిహార్ తదితర రాష్ట్రాల్లో ఉన్న చట్టాలను తెలంగాణలో కూడా అమలు చేయాలన్నారు. వేలాది రూపాయలు ఖర్చు చేసి పంటలను సాగు చేస్తున్న రైతులు.. అడవి పందులతో తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు.