Mother's Day: మమతల కోవెల..సేవే ‘సాధన’

Mothers Day Special On Home For Mentally Challenged People - Sakshi

సాధారణ పిల్లలతో పోలిస్తే intellectual disability(మేధో వైకల్యం) పిల్లలకి చాలాచాలా ప్రేమ కావాలి. ఆదరణ కావాలి. అలాగే ఇలాంటి పిల్లల విషయంలో తండ్రులతో పోలిస్తే తల్లులే ఎక్కువ బాధ్యత తీసుకుంటారు. స్పీచ్‌ థెరపీ అని, ఫిజియో థెరపీ అంటూ నానా కష్టాలు పడుతూ చాలా జాగ్రత్తగా  వాళ్లని ఆసుపత్రులకు తీసుకెడుతున్న తల్లులు చాలామంది మన కంట పడతారు కదా?  మరి అలాంటి పిల్లల్ని దాదాపు 148 మందిని అక్కున చేర్చుకుని ఆదరిస్తోంది సాధన హోం..  మెంటల్లీ చాలెంజ్‌డ్‌  కిడ్స్‌ కోసం ఎలాంటి వసతులు ఉన్నాయి. మానవతకు ప్రతీకగా నిలుస్తూ  ఎంతో మంది జీవితాల్లో అమ్మగా వెలుగులు నింపుతున్న సురేఖ రెడ్డిని సాక్షి.కామ్‌ పలకరించింది. అసలు ఈ హోం ఏర్పాటు వెనక ఉన్న ఉద్ధేశ్యం ఏంటో తెలుసుకుందాం రండి.

ఇక్కడ పిల్లల రోజువారీ అవసరాలకు అనుగుణంగా, శిక్షణ ఇస్తున్నారు. వారిలోని స్పెషల్‌ స్కిల్స్‌ గుర్తించి ఆ విధంగా ట్రైనింగ్‌ ఇస్తారు. నిపుణులైన వైద్యుల ఆధ్వర్యంలో లాంగ్వేజ్‌, స్పీచ్‌ థెరపీ, ఫిజియో థెరపీ, లాంటివి  కూడా ఉంటాయి. ఇక్కడున్న  టీచర్స్‌ పిల్లల్నందరినీ  ప్రత్యేక శ్రద్ధగా, అపురూంగా చూసుకుంటారు. మరోవిధంగా చెప్పాలంటే దేవుని బిడ్డలా  భావిస్తారు. అంతేకాదు సంగీతం,  డాన్సింగ్‌, సింగింగ్‌, ఫైన్‌ ఆర్ట్స్‌ , కంప్యూటర్‌ స్కిల్స్‌ లాంటివి నేర్పిస్తారు.  వారిలో మరింత ఉత్సాహాన్ని నింపేందుకు, తమ జీవితాన్ని వారు స్వయంగా లీడ్‌ చేసేలా తీర్చి దిద్దుతారు. అలాగే వృద్ధుల కోసం కూడా ఇక్కడ ప్రత్యేక సదుపాయాన్ని ఏర్పాడు చేయడం విశేషం. ఈ సేవలకు గాను సాధనం హోం అనేక అవార్డులు, రివార్డులు గెల్చుకుంది. 

త్యాగానికైనా,  ధైర్యానికైనా అమ్మ తరువాతే ఎవరైనా
ఇల్లయినా, ఆఫీసైనా ఒంటిచేత్తో నడిపించే ‘బాహుబలి’
కష్టమొచ్చినా.. కన్నీరొచ్చినా ఏ మాత్రం   వెరువని ధీశాలి అమ్మ

అయితే ఒక చిన్న మాట  ఈ ఒక్కరోజు అమ్మను తలచుకుని,  ఒక పువ్వో, ఒక ముద్దో,  ఒక హగ్గో ఇచ్చేస్తే సరిపోతుందా? ఎట్టి పరిస్థితుల్లోను కాదు. అయితే టేకెన్‌ ఫర్‌ గ్రాంటెడ్‌ లాగా అమ్మను తీసుకోకుండా.. అమ్మ చాకిరీకి, త్యాగానికి  విలువ  ఇచ్చి.. హార్ట్‌ఫుల్‌గా అమ్మను ప్రేమించాలి. ఆమె మనసుకు కష్టం కలిగినపుడు  నేనున్నాను అనే భరోసా ఇవ్వాలి.. అచ్చం అమ్మలాగా.. మాతృదినోత్సవం సందర్భంగా అమ్మలందరికీ విషెస్‌ అందిస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top