నాంపల్లి కోర్టు: లైంగిక వేధింపుల కేసు.. హోంగార్డుకు 30 ఏళ్ల జైలు శిక్ష | Molestation On Minor Nampally Court Sentenced Home Guard 30 Year Prison Term | Sakshi
Sakshi News home page

నాంపల్లి కోర్టు: లైంగిక వేధింపుల కేసు.. హోంగార్డుకు 30 ఏళ్ల జైలు శిక్ష

Aug 3 2021 8:11 PM | Updated on Aug 3 2021 9:10 PM

Molestation On Minor Nampally Court Sentenced Home Guard 30 Year Prison Term - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నాంపల్లి కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. లైంగిక దాడి కేసులో నిందితుడికి 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆ వివరాలు.. మైనర్‌ బాలికపై లైంగిక దాడి కేసులో హోంగార్డ్‌ మల్లికార్జున్‌కు నాంపల్లి కోర్టు 30 ఏళ్ల జైలుశిక్ష విధించించింది. దాంతో పాటు బాధితురాలి కుటుంబానికి 40 వేల రూపాయలు చెల్లించాల్సిందిగా కోర్టు ఆదేశించింది. 

కేసేంటంటే..
ఈ ఏడాది ఫిబ్రవరిలో తుకారాంగేట్‌ వద్ద మైనర్‌ బాలికపై హోంగార్డు మల్లికార్జున్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఫిబ్రవరి 19న హోంగార్డు మల్లికార్జున్‌ను అరెస్ట్‌ చేశారు. అనంతరం బాలిక గర్భం దాల్చడంతో.. మెడికల్‌ రిపోర్ట్స్‌ నుంచి ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్ట్‌ వరకు.. అన్ని ఆధారాలు సేకరించిన పోలీసులు వాటిని కోర్టులో సమర్పించారు. వీటన్నింటిని పరిశీలించిన కోర్టు నిందితుడు మల్లికార్జున్‌కు 30 ఏళ్ల జైలుశిక్షతోపాటు.. బాధితురాలి కుటుంబానికి రూ.40 వేలు చెల్లించాలని ఆదేశించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement