ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: సింహయాజి విడుదల | MLA poaching case: A3 Sinhayaji released On Bail | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: చంచల్‌గూడ జైలు నుంచి A3 సింహయాజి విడుదల

Dec 7 2022 9:53 AM | Updated on Dec 7 2022 9:54 AM

MLA poaching case: A3 Sinhayaji released On Bail - Sakshi

సింహయాజి స్వామి(సర్కిల్‌లో).. పాత చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: మొయినాబాద్‌ ఫామ్‌హౌజ్‌ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం కేసుకు సంబంధించి.. నిందితుడు సింహయాజి స్వామి ఇవాళ చంచల్‌గూడ జైలు నుంచి విడుదల అయ్యాడు. ఈ కేసులో A3నిందితుడిగా ఉన్న సింహయాజికి బెయిల్‌ దొరికిన విషయం తెలిసిందే. అయితే.. 

హైకోర్టు బెయిల్ మంజూరు చేసి వారం తర్వాత బుధవారం సింహయాజి విడుదల అయ్యాడు. షూరిటీలు చెల్లింపులో ఆలస్యం కావడంతో.. విడుదలకు ఆటకం ఏర్పడింది. ఇక ఈ కేసులో.. మరో ఇద్దరు నిందితులు జైల్లోనే  ఉన్నారు. 

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో.. ముగ్గురు నిందితులకు రామచంద్రళబారతి, నందకుమార్, సింహయాజులు కు వారం క్రితం హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే..  కేసులు పెండింగ్‌లో ఉండటంతో రామచంద్ర భారతి, నంద కుమార్‌లు జైల్లోనే ఉండాల్సి వచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement