తెలంగాణ ప్రభుత్వం అన్ని క్రీడలకు ప్రోత్సాహాన్ని ఇస్తోంది: మంత్రి తలసాని

Minister Talasani At Power Lifting Championship At Yousufguda - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం అన్ని క్రీడలకు ప్రోత్సాహాన్ని అందిస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు మంగళవారం యూసుఫ్ గూడలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో నేషనల్ జూనియర్, సబ్ జూనియర్, మాస్టర్ మెన్, ఉమెన్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ ను మంత్రి శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ పోటీలకు 26 రాష్ట్రాల నుంచి 800 మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అన్ని క్రీడలను ప్రోత్సహిస్తుందని, క్రీడాకారులకు చేయూతను అందిస్తుందని చెప్పారు.

క్రీడలలో పాల్గొనడం వలన ఎంతో ఆరోగ్యంగా, దృఢంగా ఉంటామని చెప్పారు. ఈ చాంపియన్ షిప్ ఏర్పాటు చేసిన నిర్వహకులు, క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. క్రీడలను మరింత  ప్రోత్సహించాలనే ఉద్దేశం తో ప్రభుత్వం క్రీడా పాలసీని తీసుకొచ్చిందని చెప్పారు. ప్రతి మండల కేంద్రంలో క్రీడా మైదానాలు ఉండే విధంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. హైదరాబాద్ నగరంలోని ఎల్‌బీ స్టేడియం, ఉప్పల్ స్టేడియాలు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్ వేదికగా నేషనల్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ జరగడం ఎంతో సంతోషిదగ్గ విషయం అన్నారు. ఇలాంటి పోటీల నిర్వహణకు అవసరమైన సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉంటామని ప్రకటించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top