కరోనాపై మంత్రి హరీశ్‌ రావు సమీక్ష.. ఏమన్నారంటే?

Minister Harish Rao Review Meeting On Covid-19 Situation - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పలు దేశాల్లో కరోనా వ్యాప్తి నేపథ్యంలో భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్‌ కట్టడికి సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో కరోనాపై వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కీలక సూచనలు చేశారు. 

ఈ సందర్భంగా ప్రపంచంలో కరోనా వ్యాప్తి తీరును గమనిస్తున్నాము. వైద్య, ఆరోగ్య శాఖ అన్ని విధాలుగా సిద్ధంగా ఉంది. ప్రతీ ఒక్కరూ బూస్టర్‌ డోస్‌ వేసుకోవాలన్నారు. కరోనా పట్ల ఆందోళన చెందవద్దు. కానీ, అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కరోనా వ్యాప్తి మన వద్ద లేనప్పటికీ, ముందు జాగ్రత్తగా అన్ని చెక్ చేసుకోవాలని వైద్యాధికారులకు మంత్రి ఆదేశించారు.

మందులు, ఆక్సిజన్, ఐసీయూ పడకలు అన్ని కూడా పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉంచాలని అధికారులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు పాజిటివ్ వచ్చిన శాంపిల్స్‌ని జీనోమ్ సీక్వెన్స్ కోసం గాంధీ ఆస్ప‌త్రికి పంపాలని, ఎయిర్ పోర్టులో స్క్రీనింగ్ నిర్వహించాలని మంత్రి హ‌రీశ్‌రావు ఆదేశించారు.

మరిన్ని వార్తలు :

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top