11న మెగా లోక్‌అదాలత్‌ 

Mega Lok Adalat Will Be Held On11th In All The Courts Across The TS State - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ న్యాయసేవా సాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల 11న(శనివారం) రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో మెగా లోక్‌అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర న్యాయసేవా సాధికార సంస్థ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. రాజీ ద్వారా పరిష్కారానికి అవకాశం ఉన్న కేసులను ఈ అదాలత్‌లో పరిష్కరించుకోవాలని సూచించింది. అదాలత్‌ తీర్పునకు అప్పీల్‌ ఉండదని వివరించింది. అదాలత్‌లో కేసులను పరిష్కరించుకుంటే సివిల్‌ కేసుల్లో చెల్లించిన కోర్టు ఫీజును తిరిగి చెల్లిస్తామని పేర్కొంది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top