TS: డీఎస్సీ కొత్త నోటిఫికేషన్‌ విడుదల | Mega DSC Notification Released In Telangana | Sakshi
Sakshi News home page

TS: డీఎస్సీ కొత్త నోటిఫికేషన్‌ విడుదల

Feb 29 2024 11:37 AM | Updated on Feb 29 2024 5:56 PM

Mega DSC Notification Released In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఇప్పటికే పాత నోటిఫికేషన్‌ను రద్దు చేసిన ప్రభుత్వం.. గురువారం డీఎస్సీ కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. తాజా నోటిఫికేషన్‌లో 11వేల టీచర్‌ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. గురువారం.. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విద్యాశాఖ అధికారులతో కలిసి డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ నోటిఫికేషన్‌ సందర్బంగా గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ అప్లై చేసుకోవాల్సిన అవసరంలేదని విద్యాశాఖ స్పష్టం చేసింది. 

పోస్టుల వివరాలు..
స్కూల్‌ అసిస్టెంట్‌ 2629,
లాంగ్వేజ్‌ పండిట్‌ 727,
ఎస్జీటీ 6508,
పీఈటీ 182.

Advertisement
 
Advertisement
Advertisement