సాక్షి, హైదరాబాద్: పీర్జాదిగూడకు చెందిన కాంతంశెట్టి రమాప్రసాద్ వెంకట సత్య జయంత్ 2022లో రష్యాలోని కల్మికియా ప్రాంతం కల్మిక్ స్టేట్ యూనివర్సిటీలో పీజీ చదివేందుకు వెళ్లాడు. చదువయ్యాక ఆర్మీలో చేరడం తప్పనిసరన్న స్థానిక స్నేహితుల సూచన మేరకు 2024 మేలో రష్యా సైన్యంలో చేరాడు. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి 14 నుంచి జయంత్ గల్లంతయ్యాడు.
ఫ్రిబవరి 21న డొనెట్స్క్లో ఉక్రెయిన్ డ్రోన్ దాడిలో జయంత్ గల్లంతయ్యాడు. అప్పటినుంచి తల్లి రమా..కుమారుడి జాడ చెప్పాలంటూ భారత, రష్యా ప్రభుత్వాలకు మెయిల్స్ పంపారు. 2024లోనే జయంత్ రష్యా పౌరసత్వం పొందాడని సాధారణ భారతీయ పౌరుడిగా పరిగణించడం సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. డీఎన్ఏ నమూనాలను అందించారు. వీటిని ఉక్రెయిన్ దాడిలో మరణించిన, క్షతగాత్రులైన వారి నమూనాలతో పోల్చి చూసినప్పటికీ ఎలాంటి ఫలితం కనిపించలేదు. దీంతో శుక్రవారం ప్రవాసి ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది.
లక్డీకాపూల్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా యువకులు రష్యాలో నలుగురు సురక్షితంగా ఉన్నారా? అనే వివరాలు సేకరించాలని సీఎం ప్రజావాణి రాష్ట్ర ఇంచార్జ్ గద్వాల్ విజయలక్ష్మి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ను కోరారు. శుక్రవారం ప్రజాభవన్లో ప్రజావాణిలో... బాధితుల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. యువకుల ఆచూకీ, భద్రత వివరాలను త్వరలోనే తెలియజేస్తామని నిజామాబాద్ సీపీ సమాధానమిచ్చారు. ప్రజావాణిలో 105 దరఖాస్తులు అందాయి.


