
గత ఏడాది కాలంలో 28 వేల మందికి రూ.60 కోట్ల మేర చెల్లింపులు
రికవరీకి ప్రభుత్వం ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: ఏడాది కిందట చని పోయిన పింఛనుదారులకు చేయూత పింఛన్లు అందజేశారు. ఇలా గత ఏడాది 28 వేల మందికి రూ.60 కోట్ల మేర చెల్లింపులు జరిగినట్టు గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని గ్రామీణ దారిద్య్ర నిర్మూలనా సంస్థ (సెర్ప్) తాజాగా గుర్తించింది. చేయూత పింఛన్లు అందుకుంటూ మరణించిన వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఇతర కేటగిరీ లబ్ధిదారుల వివరాలను వారి కుటుంబసభ్యులు అధికారులకు తెలియ జేయకపోవ డంతో ఈ పరిస్థితి తలెత్తిందని ఉన్నతాధికారులు నిర్ధారించారు. వృద్ధులు, ఇత రకేటగిరీల వారికిచ్చే రూ.2,016 మొదలు.. దివ్యాంగులకు ఇచ్చే రూ.4,016 వరకు చనిపో యిన లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో ఏడాది పాటు పింఛన్ మొత్తం జమ అయినట్టు వెల్లడైంది. దీంతో ఈ పింఛన్‌దారుల కుటుంబీకుల నుంచి ఈ మొత్తాన్ని రికవరీ చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు.
ఈ మేరకు సంబంధిత అధికారులకు గ్రామీణాభివృద్ది శాఖ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. గ్రామీణ– పట్టణ స్థానిక సంస్థల్లో క్షేత్రస్థాయి పరిశీలనలు, సర్వేలు, క్రాస్ వెరిఫికేషన్, ఎన్‌ఐసీ పోర్టల్‌లో పేర్లను సరిచూడడం వంటి వాటి ద్వారా పింఛన్‌దారులు చనిపోయినా వారి కుటుంబసభ్యు లు డబ్బులు విత్‌డ్రాచేయడాన్ని గుర్తించారు. అంతేకాకుండా మరణించిన వారి బ్యాంక్ డెబి ట్ కార్డులను వారి కుటుంబీకులు ఉపయోగించి ఏటీఎంల నుంచి డబ్బు తీసుకున్నట్టుగా కూడా తేలింది. దీంతో మరణించిన 28 వేల పింఛనుదారుల పేర్లను జాబితా నుంచి తొల గించినట్టు అధికారులు వెల్లడించారు. అదేసమ యంలో వృద్ధాప్య పింఛన్లకు సంబంధించి మరణించిన వారి భార్య లేదా భర్తకు పింఛన్ అందించేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు.