అంతా మార్చిన ఆ లేఖ! | Maoist Later Leader To Mallojula | Sakshi
Sakshi News home page

అంతా మార్చిన ఆ లేఖ!

Oct 16 2025 7:30 AM | Updated on Oct 16 2025 7:30 AM

Maoist Later Leader To Mallojula

మహారాష్ట్ర: మావోయిస్టు పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, అగ్రనే త మల్లోజుల వేణుగోపాల్‌ లొంగిపోవటానికి మాజీ మావోయిస్టు ఒకరు రాసిన ఓ లేఖ కారణ మని పోలీసులు తెలిపారు. మల్లోజులతో పాటు మరికొందరితో సన్నిహితంగా పని చేసిన అనిల్‌ అనే మావోయిస్టు గత ఏడాది సెప్టెంబర్‌ 15న పోలీసులకు లొంగిపోయారు. లొంగిపోయిన తర్వాత ప్రశాంత జీవనం గడుపుతున్నానని పేర్కొంటూ ఇటీవల ఆయన మల్లోజులకు లేఖ రాశారు. ఆ తర్వాతే మల్లోజుల కూడా లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు తెలిపారు. ‘గౌరవనీయులైన కామ్రేడ్‌ సోను దాదా.. జోహార్‌! ప్రస్తుత కఠిన పరిస్థితుల్లో కూడా మీరు సురక్షితంగా ఉన్నారని భావిస్తున్నాను. నేను, అంజు నాగపూర్‌లో 2024 సెప్టెంబర్‌ 15న లొంగిపోయాం. ప్రస్తుతం మేము గడ్చిరోలిలో ఉన్నాం. 

పోలీసుల నుంచి మాకు మంచి సహకారం అందింది. నేను ఉద్యోగం కూడా సంపాదించుకున్నాను. గడ్చిరోలిలో ఇల్లు కూడా కట్టుకోవా లని ప్రయత్నాలు చేస్తున్నాం. తారక్క (మల్లోజు భార్య) కూడా మాతోపాటే ఉంది. ఇక్కడ మనవాళ్లంతా దాదాపు 60–70 మందిమి కలిశాం. తార దీదీ బాగున్నారు. ఆమె అనారోగ్యానికి గురైతే మేమే ఆస్పత్రికి తీసుకెళ్లాం. ఆమె కుటుంబ సభ్యులు కూడా తరచూ వచ్చి చూసి వెళ్తున్నారు’ అని లేఖ లో అనిల్‌ పేర్కొన్నాడు.  

Advertisement
 
Advertisement
Advertisement