ప్రియురాలు ఆగ్రహించింది.. | Man Cheated Young Women With Love Affair At Khammam | Sakshi
Sakshi News home page

ప్రియురాలు ఆగ్రహించింది..

Dec 9 2020 7:57 AM | Updated on Dec 9 2020 7:57 AM

Man Cheated Young Women With Love Affair At Khammam - Sakshi

మౌనపోరాటం చేస్తున్న హేమలత   

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం(కారేపల్లి): పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి, ఇప్పుడు మాట తప్పి మరో యువతితో పెళ్లికి సిద్ధపడిన తన ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు మౌనపోరాటానికి దిగింది. ఈ ఘటన మండల పరిధిలోని భాగ్యనగర్‌తండాలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణానికి చెందిన కుంజా హేమలత ప్రస్తుతం పినపాక మండలం ఐలాపురం గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా పని చేస్తోంది.  చదవండి: (స్నానం చేస్తుంటే వీడియో తీసి.. ఆపై)

ఇకారేపల్లి మండలం భాగ్యనగర్‌తండా గ్రామానికి చెందిన గుగులోతు అశోక్‌ గుండాల మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. వీరిద్దరూ భద్రాచలంలోని ఐటీడీఏ బీఈడీ కళాశాలలో చదువుకున్నారు. ఆ క్రమంలో వారి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. 8 ఏళ్లుగా వారు ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని తనను లొంగదీసుకున్న అశోక్‌ మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడని, తనకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదని, కుటుంబ సభ్యులతో హేమలత ప్రియుడి ఇంటి ఎదుట మౌన పోరాటానికి దిగింది. చదవండి: (నెల రోజుల్లో వివాహం.. అర్ధరాత్రి దారుణహత్య)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement