మల్లారెడ్డి కేసులో మొదటి రోజు ముగిసిన విచారణ.. కొడుకు, అల్లుడు ఏమన్నారంటే?

Malla Reddy Case IT Officials First Day Investigation Complete - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఈ మధ్య కాలంలో జరిగిన ఈడీ, ఐటీ దాడులు రాజకీయంగా ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లలో ఐటీ దాడులు పొలిటికల్‌ హీట్‌ను పెంచాయి. కాగా, పెద్ద మొత్తంలో నగదు దొరకడంతో మల్లారెడ్డి సహా మరో 16 మందిని ఐటీ అధికారులు విచారిస్తున్నారు. 

ఇక, ఈ నేపథ్యంలో మల్లారెడ్డి ఐటీ దర్యాప్తులో మొదటిరోజు ఐటీ అధికారులు చేపట్టిన విచారణ ముగిసింది. ఐటీ అధికారులు మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి, అల్లుడు రాజశేఖర్‌ రెడ్డిని విచారించారు. కాగా, విచారణ అనంతరం వారిద్దరూ మీడియాతో మాట్లాడుతూ.. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాము. ఈరోజు ఎవరికైతే నోటీసులు ఇచ్చారో వారు మాత్రమే విచారణకు హాజరయ్యారు. విచారణ కోసం కాలేజీల ప్రిన్స్‌పాల్స్‌, అకౌంటెంట్స్‌ అందరూ విచారణకు వచ్చారు. 

ఈ సందర్భంగా వారికి తెలిసిన వివరాలను అధికారులకు సవివరంగా చెప్పారు. ఐటీ అధికారులు ఇచ్చిన డేట్స్‌ ప్రకారంగా విచారణకు ప్రతీ ఒక్కరూ వస్తారు. అధికారులు చెప్పిన ఫార్మాట్‌ ప్రకారం కాలేజీ డేటాను వారికి అందించాము. ఇక, మొదటి రోజు 12 మంది విచారణకు వచ్చినట్టు తెలుస్తోంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top