Line clear for salary revision of TSRTC employees - Sakshi
Sakshi News home page

ఆర్టీసీ ఉద్యోగుల వేతన సవరణకు లైన్‌క్లియర్‌? 

Jul 29 2023 2:01 AM | Updated on Jul 29 2023 11:41 AM

Line clear for salary revision of RTC employees - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వేతన సవరణకు ఎదురుచూస్తున్న ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబురు చెప్పేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. ఈనెల 31న జరిగే మంత్రివర్గ సమావేశ ఎజెండాలో ఆర్టీసీ ఆర్థికపరమైన అంశాలను చేర్చటంతో ఈ చర్చ జరుగుతోంది.  

44 శాతం ఫిట్‌మెంట్‌తో... 
2013 సంవత్సరానికి సంబంధించి 2015లో ప్రభుత్వం వేతన సవరణ చేసిన విషయం తెలిసిందే. 30 శాతం మేర ఫిట్‌మెంట్‌ ప్రకటిస్తారని కార్మిక సంఘాలు భావించగా, ప్రభుత్వం ఏకంగా 44 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చి ఆశ్చర్యపరిచింది. దీంతో ఆర్టీసీపై రూ.850 కోట్ల వార్షికభారం పడింది. అప్పటి నుంచి ప్రభుత్వం తర్వాత వేతన సవరణల జోలికి పోలేదు.  

వేతన సవరణ 2017లో చేయాల్సి ఉండగా.. 
2017లో వేతన సవరణ చేయాల్సి ఉండగా, ప్రభుత్వం స్పందించలేదు. దీంతో అప్పట్లో కార్మిక సంఘాలు సమ్మెబాట పట్టాయి. మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం కార్మిక సంఘాలతో చర్చలు జరిపింది. వేతనసవరణ రూపంలో పడే భారాన్ని తట్టుకునే పరిస్థితి లేక, మధ్యంతర భృతితో సరిపెట్టింది. 16 శాతం ఇంటీరియమ్‌ రిలీఫ్‌ ఇవ్వగా, ఇప్పటికీ అదే కొనసాగుతోంది. 2021లో ఇవ్వాల్సిన వేతన సవరణపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.  

అదే 16 శాతాన్ని ఖాయం చేస్తే రూ.40 కోట్ల భారం  
ప్రస్తుతం 2017కు సంబంధించిన 16 శాతం మధ్యంతర భృతి కొనసాగుతోంది. అంతే శాతాన్ని ఫిట్‌మెంట్‌గా మారిస్తే నెలవారీ భారం ఏకంగా రూ.40 కోట్లుగా ఉంటుందని ఇప్పటికే ఆర్టీసీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ప్రస్తుతం అమలు చేస్తున్న మధ్యంతర భృతికి అదనంగా ఒక్కశాతం అదనంగా ఫిట్‌మెంట్‌ ప్రకటించినా ప్రతినెలా రూ.3 కోట్ల మేర అదనపు భారం పడుతుందని అధికారులు పేర్కొన్నారు. 18, 20, 22, 24 శాతం లెక్కలను కూడా పరిశీలించి ఓ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement