వీల్‌చైర్‌లో వచ్చి.. పరీక్ష రాసి

Leg Fracture Women Write Supervisor Job Exam In Nalgonda District - Sakshi

కదల్లేని పరిస్థితిలో ఉన్నా తన లక్ష్యాన్ని మాత్రం వదల్లేదు. నడవలేక పోయినా పరీక్ష రాయాలన్న తపనే తనను ముందుకు నడిపింది. దీంతో ఇలా వీల్‌చైర్‌లో వచ్చి మరీ పరీక్ష రాసింది. నల్లగొండ జిల్లా నకిరేకల్‌ మండలం మంగళపల్లి అంగన్‌వాడీ టీచర్‌ గుజ్జ ప్రేమలతకు నెల రోజుల కిందట కాలు ఫ్యాక్చర్‌ కావడంతో హైదరాబాద్‌లో శస్త్ర చికిత్స చేయించుకుంది. రెండు నెలలు రెస్టులో ఉండాలని వైద్యులు సూచించారు.

దీంతో హైదరాబాద్‌లోనే ఉంటూ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సూపర్‌వైజర్‌ ఉద్యోగం కోసం ప్రేమలత ప్రిపేర్‌ అవుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఆమెకు సూపర్‌వైజర్‌ ఉద్యోగ పరీక్ష ఉంది. దీంతో హైదరాబాద్‌ నుంచి నేరుగా వీల్‌చైర్‌లో వచ్చిన ఆమె.. దిండు, స్టూల్‌ కూడా పరీక్ష కేంద్రానికి వెంట తెచ్చుకున్నారు. నల్లగొండ ఎన్‌జీ కాలేజీలో పరీక్ష రాసి వెళ్లారు.  
– సాక్షి స్టాఫ్‌ ఫొటో గ్రాఫర్‌ నల్లగొండ  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top