తెలంగాణలో మొత్తం వాహనాల సంఖ్య ఎంతో తెలుసా? | last 8 years in Telangana Number of vehicles has more than Doubled | Sakshi
Sakshi News home page

తెలంగాణలో మొత్తం వాహనాల సంఖ్య ఎంతో తెలుసా?

Jan 26 2023 5:28 AM | Updated on Jan 26 2023 12:09 PM

last 8 years in Telangana Number of vehicles has more than Doubled - Sakshi

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ గత ఎనిమిదిన్నరేళ్లలో రాష్ట్రంలో వాహనాలు రెట్టింపును మించి పెరిగాయి.

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ గత ఎనిమిదిన్నరేళ్లలో రాష్ట్రంలో వాహనాలు రెట్టింపును మించి పెరిగాయి. సరిగ్గా ఆరేళ్ల క్రితం రాష్ట్రంలో వాహనాల సంఖ్య కోటి మార్కును దాటగా, ఇప్పుడది కోటిన్నరను దాటిపోయింది. రాష్ట్రం ఆవిర్భవించిన 2014 జూన్‌లో తెలంగాణ ప్రాంతంలో మొత్తం వాహనాలు 71,54,667 మాత్రమే కావడం గమనార్హం. కాగా ఈ ఎనిమిదిన్నరేళ్లలో ఏకంగా 81,50,483 పెరిగాయి. ప్రతి నెలా సగటున 80 వేల కొత్త వాహనాలు రోడ్డెక్కాయి. ఈ పెరుగుదల ఇలాగే కొనసాగితే మరో ఐదేళ్లలో రెండు కోట్లకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

పోటాపోటీగా ద్విచక్రవాహనాలు, కార్లు
గతంలో ఇంటింటికీ ఓ సైకిల్‌ ఉండగా, ఇప్పుడా స్థానాన్ని ద్విచక్రవాహనాలు ఆక్రమించాయి. కొందరికి రెండు కూడా ఉంటున్నాయి. కార్ల కొనుగోళ్లు కూడా పోటీ పడుతున్నట్టుగా పెరుగుతున్నాయి. రా ష్ట్రంలో ప్రస్తుతం 84 లక్షల గృహాలుండగా, ఈ నెల 23 వరకు అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం ద్విచక్ర వాహనాల సంఖ్య 1,12,90,406కు చేరు కుంది. 2014 జూన్‌లో తెలంగాణలో 8,84,870 కార్లు ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య 19,84,059 కు చేరింది. కోవిడ్‌ సమయంలో సెకండ్‌ హ్యాండ్‌ వాహనాల క్రయవిక్రయాలు విపరీతంగా సాగగా, కొత్త వాహనాల అమ్మకాలు కాస్త తగ్గాయి. అయితే గతేడాది కొత్త వాహనాల విక్రయం బాగా పెరగటంతో వాహనాల సంఖ్యలో పెరుగుదల ఊ పందుకుంది. ఏడాదిలో 5.61 లక్షల ద్విచక్ర వా హనాలు, 1.52 లక్షల కార్లు కొత్తగా వచ్చి చేరాయి. 

క్యాబ్‌ సంస్కృతి పెరుగుదలతో..
రాష్ట్రంలో క్యాబ్‌ల వాడకం గణనీయంగా పెరిగింది. గతంలో ఆటోలు తప్ప క్యాబ్‌లు నామమాత్రంగానే ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య భారీగా పెరిగింది. 2014 నాటికి రాష్ట్రంలో కేవలం 49 వేలు మాత్రమే ఉండగా, ఇప్పుడు 1.18 లక్షలకు చేరుకున్నాయి. ఆరుగురు కంటే ఎక్కువమంది ప్రయాణించే మ్యాక్సీ క్యాబ్‌లు అప్పట్లో 6,390 మాత్రమే ఉండగా, ఇప్పుడు 30,904కు చేరుకున్నాయి. 

ఎలక్ట్రిక్‌ వాహనాల జోరు
చమురు ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో గత ఏడాది ఎలక్ట్రిక్‌ వాహనాల సంఖ్య భారీగా పెరిగింది. వీటి కొనుగోళ్లు మరింత పెరిగే అవకా శం ఉందని అంచనా. ప్రస్తుతం రాష్ట్రంలో 45 వేల ఎలక్ట్రిక్‌ ద్విచక్రవాహనాలుండగా, ఎలక్ట్రిక్‌ కార్లు 4 వేలను దాటాయి. 2014లో వాటి సంఖ్య సున్నా. 

ఆర్టీసీ బస్సుల సంఖ్యే తగ్గింది..
అన్ని రకాల కేటగిరీ వాహనాలు గత ఎనిమిదిన్నరేళ్లలో దాదాపు రెట్టింపు అవటమో, అంతకుమించి పెరగటమో జరగ్గా.. ఆర్టీసీ బస్సుల సంఖ్య మాత్రం భారీగా తగ్గిపోయింది. రాష్ట్రం ఏర్పడ్డ సమయంలో తెలంగాణ ఆర్టీసీ వద్ద 10,579 బస్సులు ఉండేవి. రవా ణాశాఖ లెక్కల ప్రకారం ప్రస్తుతం వాటి సంఖ్య 9,400 మాత్రమే. కొత్త బస్సుల కొనుగోలు అంతంత మాత్రంగానే ఉండటం, నడిచే పరిస్థితి లేని బస్సులను తుక్కుగా మార్చాల్సి రావటంతో వాటి సంఖ్య గణనీయంగా తగ్గి పోయింది. వ్యక్తిగత వాహనాల సంఖ్య పెరగటానికి ఇదీ ఒక కారణమని నిపుణులు చెపుతున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement