కూకట్‌పల్లిలో గజం భూమి ధర రూ.2.98 లక్షలు | Land auction at Kukatpally Housing Board | Sakshi
Sakshi News home page

కూకట్‌పల్లిలో గజం భూమి ధర రూ.2.98 లక్షలు

Jun 12 2025 8:06 AM | Updated on Jun 12 2025 3:44 PM

Land auction at Kukatpally Housing Board

కేపీహెచ్‌బీ కాలనీ స్థలాలకు భారీ స్పందన 

రూ.141.36 కోట్లు పలికిన 18 ప్లాట్‌లు

హైదరాబాద్: కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు స్థలాలకు  బుధవారం ఏర్పాటు చేసిన వేలం పాటలో భారీ స్పందన లభించింది. కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు కాలనీలోని 7వ ఫేజ్‌లోని 18 ప్లాట్లను వేలం వేయగా అన్ని ప్లాట్లు హాట్‌కేక్‌ల్లా అమ్ముడుపోయాయి. 7వ ఫేజ్‌లోని ప్లాట్‌ నంబర్‌ 22ను అత్యధికంగా గజానికి  రూ.2.98 లక్షల చొప్పున దక్కించుకున్నారు. 

151 గజాలున్న ఈ ప్లాట్‌ 4 కోట్ల 52 లక్షల 72 వేల 160 రూపాయల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. అదే విధంగా 292 గజాలు ఉన్న 19వ నంబర్‌ ప్లాట్‌ గజానికి రూ.2.88 లక్షల చొప్పున వేలకు వేలం పాడారు. ఈ ప్లాట్‌ నుంచి 8 కోట్ల 40 లక్షల 96 వేల రూపాయలు వచ్చాయి. ఇక్కడ ఉన్న మొత్తం 18 ప్లాట్‌లలోని 6,236.33 గజాలకు కలిపి 141 కోట్ల 36 లక్షల 89 వేల 100 రూపాయల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు.   
   

Advertisement
 
Advertisement
Advertisement