సాక్షి, హైదరాబాద్: రేడియల్ రోడ్-2 టెండర్లలో 3,296 కోట్ల కుంభకోణం జరిగిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ అంశమై ఈరోజు (శనివారం) సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. నచ్చిన సంస్థలకే కాంట్రాక్టులు కట్టబెట్టారని తక్కువ ధరకు బిడ్లు వేసిన సంస్థలను పక్కన పెట్టారు. ఐదు పని దినాల్లోనే టెండర్ల ప్రక్రియ ఎలా పూర్తి చేసారని లేఖలో ప్రశ్నించారు
టెండర్లలో రూ.600 కోట్ల నష్టం జరిగిందన్న ఆరోపణలపై విచారణకు డిమాండ్ రేడియల్ రోడ్-1 టెండర్లపైనా అనుమానాలున్నాయని టెండర్లను రద్దు చేసి సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. హెచ్‌ఎండీఏ, హెచ్‌జీసీఎల్ కాంట్రాక్టులపై కాగ్ ప్రత్యేక ఆడిట్ జరపాలి. రేడియల్ రోడ్ల టెండర్లపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.
అదే విధంగా ఇటీవల గజ్వేల్ MRO రైతుపట్ల వ్యవహరించిన తీరుపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సమస్యను పరిష్కరించాల్సింది పోయి బాధను ఎగతాళి చేస్తారా? రైతును పురుగుల మందు తాగి చావలేదా అని అడుగుతారా? అన్నదాతల పట్ల ఇంత అమానవీయంగా వ్యవహరిస్తారా? అని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. గజ్వేల్ MROపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: బంగారం కోసం వెళితే విషాదం


