ఇళ్లపై జాతీయజెండా ఎగురవేయాలి: కిషన్‌రెడ్డి పిలుపు | Kishanreddy Comments On Hargartiranga Programme | Sakshi
Sakshi News home page

ఇళ్లపై జాతీయజెండా ఎగురవేయాలి: కిషన్‌రెడ్డి పిలుపు

Aug 11 2024 1:26 PM | Updated on Aug 11 2024 1:35 PM

Kishanreddy Comments On Hargartiranga Programme

సాక్షి,హైదరాబాద్‌: ఇండిపెండెన్స్‌ డే సందర్భంగా తెలంగాణలో ప్రతి ఒక్కరు తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురేవయాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కోరారు. ఆదివారం(ఆగస్టు11) హైదరాబాద్‌లోని రాంనగర్ చౌరస్తాలో తిరంగా ర్యాలీని కిషన్‌రెడ్డి ప్రారంభించి మాట్లాడారు.

‘జెండా పండుగ ప్రారంభమైంది. గత మూడు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జెండా పండుగను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. హర్ ఘర్ తిరంగా పేరుతో ప్రతి ఇంటిపై జాతీయపతాకాన్ని  ఎగరవేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. 

భారతీయ జనతా యువమోర్చ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీని తిరంగా యాత్రను నిర్వహిస్తాం. గత ఆగస్టు 15న సుమారు 23 కోట్ల మంది ప్రజలు తమ ఇళ్లపై జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. మళ్లీ ఈసారి అదే స్ఫూర్తిని కొనసాగించాలని ప్రధాని పిలుపునిచ్చారు’అని కిషన్‌రెడ్డి తెలిపారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement