వారసత్వ రేసులో రామప్ప.. యునెస్కో కీలక సూచనలు

Key Suggestions From Unesco About Ramappa Temple For World heritage Sites Scrutiny - Sakshi

సాక్షి, పాలంపేట(వరంగల్‌): రుద్రేశ్వరాలయం అంటే పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు కానీ రామప్ప అంటే చాలా మంది ఇట్టే గుర్తు పట్టేస్తారు. ప్రస్తుతం ప్రపంచ వారసత్వ హోదా గుర్తింపు అంశం చివరి అంకానికి చేరుకుంది. అయితే రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా ఇవ్వాలా, వద్దా? అనేది జులై 25న తేలనుంది. వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్లను గుర్తించేందుకు చైనాలో యునెస్కో జులై 16 నుంచి 31 వరకు కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తోంది. 

యూనెస్కో సూచనలు
ఇప్పటికే రామప్ప ఆలయానికి సంబంధించిన నివేదికను పరిశీలించిన యునెస్కో బృందం పలు సందేహాలు లేవనెత్తి వాటికి సంబంధించి కీలక సూచనలు చేసింది. వీటికి అనుగుణంగా రామప్ప ఆలయం ఉన్న పాలంపేట గ్రామం పేరు మీదుగా పాలంపేట ప్రత్యేక అభివృద్ధి ప్రాథికార సంస్థను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. దీంతో పాటు  యూనెస్కో చేసిన పలు సూచనలకు అనుగుణంగా మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

యునెస్కో సూచనలో మరికొన్ని కీలక అంశాలు, అడిగిన అదనపు సమాచారం
► రామప్ప ఆలయానికి అనుబంధంగా ఉన్న ఇతర ఆలయాలు, కట్టడాలు, రామప్ప సరస్సు, మంచి నీటి పంపిణీ వ్యవస్థలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా చట్టపరమైన హక్కులు కల్పించాలి.  

► రామప్ప ఆలయం, సరస్సు పరిధిలో జరిగే ఇతర అభివృద్ధి పనులకు హెరిటేజ్‌ పరిధిలోకి తీసుకురావాలి.

► గతంలో విప్పదీసిన కామేశ్వరాలయం పునర్‌ నిర్మాణ పనులకు సంబంధించి సమగ్ర నివేదికను సమర్పించాలి

► రామప్ప ఆలయానికి వచ్చే పర్యాటకులు, భక్తుల వల్ల ఆలయ నిర్మాణానికి నష్టం రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

► శిథిలమవుతున్న ఆలయ ప్రహారి గోడల పరిరక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలి

► ఆలయ పరిరక్షణలో స్థానికులు, ఆయల పూజారులలకు భాగస్వామ్యం కల్పించాలి

► ప్రధాన ఆలయంతో పాటు ఉప ఆలయాలను కాపాడటానికి భవిష్యత్తులో తీసుకోబోయే చర్యలు

► జాతరలు, పండుగల సమయంలో ఆలయ ప్రాంగణంలో అధిక మొత్తంలో ప్రజలు ఉండకుండా  చేపట్టే చర్యలు,  పర్యాటకుల పర్యటనలకు సంబంధించి సమీకృత ప్లాను , ఎటునుండి రావాలి, ఎక్కడ ఎం చూడాలి, సూచిక బోర్డు లాంటి వివరాలు, విదేశీ భాషలలో ఆలయ వివరాలు

► కట్టడానికి  సమీపంలో భవిష్యత్ లో చేప్పట్టనున్న ప్రాజెక్టుల వివరాలు 

అద్భుతాల నెలవు
రామప్ప ఆలయం అద్భుతాలకు నెలవు. కాకతీయుల కాలం నాటి ఇంజనీరింగ్‌ నైపుణ్యానికి, శిల్ప కళా సౌందర్యానికి చెక్కు చెదరని సాక్ష్యం. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top