యశోద నుంచి కేసీఆర్‌ డిశ్చార్జి | KCR Has Been Discharged From Yashoda Hospital, Check Out His Health Condition Update | Sakshi
Sakshi News home page

యశోద నుంచి కేసీఆర్‌ డిశ్చార్జి

Jul 5 2025 12:20 PM | Updated on Jul 5 2025 12:42 PM

KCR Discharge From Yashoda Hospital

సాక్షి, హైదరాబాద్‌: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సోమాజిగూడ యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆయన ఆరోగ్యం కుదట పడటంతో ఈరోజు ఉదయం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయి నందినగర్‌లోని నివాసానికి వెళ్లారు.

అయితే, సాధారణ ఆరోగ్య పరీక్షల్లో భాగంగా కేసీఆర్‌ గురువారం యశోద ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. బ్లడ్‌ షుగర్, సోడియం స్థాయులు మానిటర్‌ చేయడానికి ఆసుపత్రిలో చేరాల్సిందిగా వైద్యులు సూచించారు. దీంతో ఆయన రెండు రోజులు అక్కడే ఉండి చికిత్స పొందారు. ప్రస్తుతం కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అనంతరం, నందినగర్‌లోని నివాసానికి వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement