మాడిన అన్నం.. రుచిలేని పప్పు | Kakatiya University Students Protest Negligence After Hostel | Sakshi
Sakshi News home page

మాడిన అన్నం.. రుచిలేని పప్పు

Nov 30 2024 5:51 AM | Updated on Nov 30 2024 5:51 AM

Kakatiya University Students Protest Negligence After Hostel

కాకతీయ వర్సిటీ హాస్టల్‌ విద్యార్థినుల ఆందోళన

కేయూ క్యాంపస్‌: భోజనం బాగా లేదని, నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్‌ చేస్తూ కాకతీయ యూనివర్సిటీలోని మహిళా హాస్టల్‌ విద్యార్థినులు శుక్రవారం రాత్రి ఆందోళనకు దిగారు. యూనివర్సిటీ మొదటి గేట్‌ వద్ద బైఠాయించారు. భోజనం బాగుండటం లేదని చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. అన్నం మాడిపోతోందని, పప్పు కూడా బాగుండటం లేదని వివరించారు.

వీసీ, రిజిస్టర్‌ రావాలని నినాదాలు చేశారు. పోలీసులు వచ్చి వారికి సర్దిచెప్పే యత్నం చేశారు. సమాచారం అందుకున్న హాస్టళ్ల డైరెక్టర్‌ రాజ్‌కుమార్‌ రాత్రి 11.30 గంటలకు అక్కడికి వచ్చి విద్యార్థినులతో మాట్లాడారు. విద్యార్థినులు తీసుకొచ్చిన ఆహారాన్ని పరిశీలించారు. ఈ సమస్యను శనివారం పరిశీలించి.. తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో విద్యార్థినులు ఆందోళన విరమించారు. వెంటనే డైరెక్టర్‌ హాస్టల్‌కు వెళ్లి పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement