ఆదివాసీ యువతికి ఓయూ నుంచి డాక్టరేట్‌ | Jyothirmayi Got Doctorate By Osmania University | Sakshi
Sakshi News home page

ఆదివాసీ యువతికి ఓయూ నుంచి డాక్టరేట్‌

May 9 2025 4:55 AM | Updated on May 9 2025 4:55 AM

Jyothirmayi Got Doctorate By Osmania University

భద్రాచలం టౌన్‌: భద్రాచలానికి చెందిన ఈసం జ్యోతిర్మయికి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్‌ లభించింది. భౌతిక శాస్త్రంలో ఆమె సమర్పించిన పరిశోధనాత్మక గ్రంథానికి గురువారం డాక్టరేట్‌ ప్రకటించారు. 

మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కుమార్తె అనురాధ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పీహెచ్‌డీ (ఆర్ట్స్‌) పూర్తి చేసిన మొదటి ఆదివాసీ మహిళ కాగా, భౌతిక శాస్త్రంలో డాక్టరేట్‌ సాధించిన ఆదివాసీగా జ్యోతిర్మయి రికార్డు సృష్టించారు. ఆమె తండ్రి అనంతయ్య భద్రాచలం పోలీస్‌ స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తుండగా, పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement