
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ విశ్వశాంతి మహాశక్తి గణపతికి తొలిపూజ జరిగింది. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తొలిపూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ బడా గణపతి వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. లక్షల మంది గణపయ్యను చూడటానికి వస్తుంటారు కాబట్టి ప్రభుత్వం అన్ని భద్రతాపరమైన ఏర్పాట్లు చేసింది. ఇక, ఖైరతాబాద్ బడా గణేశుడు 69 అడుగులు 28 వెడల్పుతో భక్తులను ఆశీర్వదించునున్నాడు.