
సదస్సులో ప్రసంగిస్తున్న గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ
రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ
ఐఐటీహెచ్‌లో ప్రారంభమైన 10వ అంతర్జాతీయ సాంస్కృతిక, సంగీత సదస్సు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రపంచానికి ఆదర్శమని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. దేశ సంస్కృతిలో సమాఖ్య విధానం, ధర్మం ఉందన్నారు. యువతలో భారతీయ శాస్త్రీయ సంగీతం, సంస్కృతి పట్ల మక్కువ పెంచేందుకు ఏర్పాటు చేసిన సంస్థ ఎస్‌పీఐసీఎంఏసీఏవై (సొసైటీ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ అండ్ కల్చరల్ అమాంగెస్ట్ యూత్) ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ ఐఐటీహెచ్‌లో 10వ అంతర్జాతీయ సాంస్కృతిక, సంగీత సదస్సు సోమవారం ప్రారంభమైంది.
జూన్ 1 వరకు జరగనున్న ఈ సదస్సులో దేశ విదేశాలకు చెందిన సుమారు 1,500 మంది కళాకారులు, సంగీత విద్వాంసులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ సదస్సు ప్రారంబోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ మాట్లాడుతూ.. త్రిపుర రాష్ట్ర నృత్యరూపం హోజగిరిని సంరక్షిస్తుండటం, ఈ సదస్సుల్లో ఈ కళారూపాన్ని ప్రదర్శించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు కళల పట్ల అవగాహన పెంచుకోవాలని గవర్నర్ సూచించారు.
భారతీయ కళలను, సంస్కృతి, సాంప్రదాయాల పట్ల యువతలో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న ఎస్‌పీఐసీ ఎంఏసీఏవై సంస్థను గవర్నర్ అభినందించారు. తొలిరోజు పద్మభూషణ్ అవార్డు గ్రహీతలు రాజా, రాధారెడ్డిల కూచిపూడి కచేరీ అలరించింది. పద్మభూషణ్ డాక్టర్ ఎన్.రాజం హిందూస్తానీ వయోలిన్ కచేరీ, గాయని అంగ్‌శైలి రాగాలు సంగీత ప్రియులను అలరించాయి. కార్యక్రమంలో ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి, స్పిక్‌మకే నేషన