తెలంగాణలో ఐపీఎస్‌ల బదిలీ.. డీజీపీగా రవిగుప్తా కొనసాగింపు | Sakshi
Sakshi News home page

తెలంగాణలో ఐపీఎస్‌ల బదిలీ.. డీజీపీగా రవిగుప్తా కొనసాగింపు

Published Tue, Dec 19 2023 7:59 PM

IPS Transfers In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మరోసారి ఐపీఎస్‌ల బదిలీ జరిగింది. రాష్ట్రంలో 20 మంది ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. అలాగే, తెలంగాణ డీజీపీగా రవిగుప్తానే కొనసాగనున్నారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక, మాజీ డీజీపీ అంజనీకుమార్‌ రోడ్‌ సేఫ్టీ డీజీగా బదిలీ అయ్యారు. 

తాజా బదిలీల ప్రకారం.. 
హైదరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఏసీబీ డీజీగా బదిలీ
రాజీవ్ రతన్ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా బదిలీ.
అభిలాష్ బిస్తా అడిషనల్ డీజీగా తెలంగాణ పోలీస్ అకాడమీకి బదిలీ.
సౌమ్య మిశ్రా జైళ్ళ శాఖ అడిషనల్ డీజీగా బదిలీ.
ఉమెన్స్ సేఫ్టీలో ఉన్న షికా గోయల్ సీఐడీ అడిషనల్ డీజీగా బదిలీ.
సీఐడీ చీఫ్‌గా ఉన్న మహేష్ భగవత్ రైల్వే రోడ్ సేఫ్టీ అడిషనల్ డీజీగా బదిలీ.
ఇంటిలిజెన్స్ చీఫ్‌గా ఉన్న అనిల్ కుమార్‌ను తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ అడిషనల్ డీజీగా బదిలీ.
సైబరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రను ఐజీపీ హోమ్ గార్డ్స్‌కు బదిలీ.
కమలాసన్ రెడ్డి ప్రొహిబీషన్ ఎక్సైజ్ డైరెక్టర్‌గా బదిలీ. 


 

Advertisement
 
Advertisement
 
Advertisement