లక్ష్య సాధనకు యువత శ్రమించాలి: మిస్టర్ ఇండియా-2025 రాకేష్‌ | Interesting Facts About Mr India Title Winner 2025 Rakesh Arne | Sakshi
Sakshi News home page

లక్ష్య సాధనకు యువత శ్రమించాలి: మిస్టర్ ఇండియా-2025 రాకేష్‌

Jun 25 2025 12:11 PM | Updated on Jun 25 2025 12:23 PM

Interesting Facts About Mr India Title Winner 2025 Rakesh Arne

యువత లక్ష్య సాధన కోసం కష్టపడి పని చేస్తే ఏదైనా సాధ్యమేనని మిస్టర్‌ ఇండియా-2025 టైటిల్‌ విజేత రాకేష్‌ అర్నే అన్నారు. మంగళవారం బషీర్‌బాగ్‌ దేశోద్ధారక భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుడారు. మోడలింగ్‌ రంగంతో పాటు సామాజిక సేవలో భాగస్వామిగా ముందుకు  సాగుతున్నట్లు తెలిపారు. ఫిట్‌నెస్‌ అంటే కేవలం శరీరానికి మాత్రమే కాకుండా మనస్సుకూ అవసరమని తన అనుభవాల ద్వారా యువతకు సందేశం ఇచ్చారు. త్వరలోనే ఫిట్‌నెస్‌, మానసిక అభివృద్ధిపై ప్రత్యేక శిక్షణ క్యాంపులు, అవగాహన కార్యక్రమాలు ప్రారంభిస్తానని పేర్కొన్నారు.

రైతు కుటుంబంలో పుట్టి..
1995 ఆగస్టు 25న జన్మించిన రాకేష్, సాధారణ రైతు కుటుంబంలో పుట్టారు. ఆయన తండ్రి యాదయ్య సామాజిక సేవకుడిగా, తాత వెంకటయ్య స్వాతంత్ర్య సమరయోధుడిగా ఆయనకు స్ఫూర్తినిచ్చారు. హైదరాబాద్‌లోని గవర్నమెంట్ సిటీ కాలేజీలో బీకామ్ (కంప్యూటర్ అప్లికేషన్స్) పూర్తి చేసిన రాకేష్, 9 సంవత్సరాలుగా సామాజిక సేవలో చురుగ్గా పాల్గొంటున్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ భాషల్లో నిష్ణాతుడైన ఆయన, ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో నివసిస్తున్నారు.

రాకేష్ ఆర్నె స్థాపించిన రక్ష గ్లోబల్ ఫౌండేషన్ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 34 సార్లు రక్తదానం, 47 మంది బాల కార్మికుల రక్షణ, 77 మంది వృద్ధులకు ఆశ్రయం, అనాథలు, అంధులు, వికలాంగులకు సహాయం, ఉచిత వైద్య శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (SDGs) కోసం కృషి చేస్తున్నారు. మలేషియాలో జరిగిన మోడల్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement