పలు సంస్థల లైవ్ కంప్యూటర్ నెట్‌వర్క్, ఐటీ వ్యవస్థల్లోకి చొరబాటు
అక్కడి రహస్య సమాచారం... ప్రజల వ్యక్తిగత డేటా యాక్సెస్
గుర్తించలేకపోయిన భారతీయ సంస్థలు
ఈ తప్పును ’సెర్ట్–ఇన్’కు రిపోర్ట్ చేసిన ఏఐ మోడళ్ల తయారీ కంపెనీలు
సాక్షి, హైదరాబాద్: మన దేశంలోని పలు సంస్థల లైవ్ కంప్యూటర్ నెట్‌వర్క్‌లలోకి, ఐటీ వ్యవస్థల్లోకి దేశీ/విదేశీ సంస్థల రోగ్ ఏఐ ఏజెంట్లు చొరబడి, రహస్య సమాచారాన్ని, ప్రజల వ్యక్తిగత డేటాను యాక్సెస్ చేశాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ విభాగం ‘సెర్ట్–ఇన్’సంస్థ ‘సైబర్ దాడి సాధనాలుగా ఏఐ ఏజెంట్లు’పేరిట హెచ్చరికను జారీ చేసింది.
అసలేం జరిగింది?
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఏఐ మోడల్ తయారీ సంస్థలు (ఓపెన్ ఏఐ, ఆంత్రోపిక్, గూగుల్ వంటివి) ఓపెన్ ఇంటర్నెట్‌లో తమ సరికొత్త ఏఐ ఏజెంట్లను టెస్టింగ్, రీసెర్చ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఏఐ ఏజెంట్లు తమకు అప్పగించిన పనుల పరిమితులను దాటి ప్రవర్తించాయి. ఇంటర్నెట్ ద్వారా అవి నేరుగా భారత్‌కు చెందిన పలు ప్రభుత్వ/ప్రైవేట్ సంస్థల లైవ్ కంప్యూటర్ సిస్టమ్స్‌లోకి చొరబడినట్టు స్పష్టమైంది. అక్కడున్న వ్యాపార రికార్డులు, రహస్య ఫైళ్లు, వ్యక్తిగత డేటాను చదివినట్టుగా వెల్లడైంది. ఈ విషయాన్ని ప్రభావితమైన భారతీయ సంస్థలు గుర్తించలేకపోయాయి. అయితే, ఈ ఏఐ మోడళ్లను తయారు చేసిన కంపెనీలు తమ అంతర్గత ఆడిట్‌లో ఈ తప్పును కనుగొని, స్వచ్ఛందంగా ’సెర్ట్–ఇన్’కు రిపోర్ట్ చేయడంతో ఇది వెలుగులోకి వచి్చంది.
ఎలా ప్రవేశించాయి?
⇒ ఏఐ ఏజెంట్లు ఎలాంటి సంక్లిష్టమైన హ్యాకింగ్ ట్రిక్స్ ఉపయోగించలేదు. భారతీయ సంస్థలు చేసిన సాధారణ సైబర్ భద్రతా లోపాలనే అవి వాడుకున్నాయి.
⇒ యాప్ కాని్ఫగరేషన్లలో, పబ్లిక్ కోడ్ రిపోజిటరీలలో ఉద్యోగులు పొరపాటున వదిలేసిన యూజర్‌నేమ్‌లు, పాస్‌వర్డ్‌లు, ఏపీఐ కీలను ఈ ఏఐలు గుర్తించి చొరబడ్డాయి.
⇒ క్లౌడ్ స్టోరేజ్ సిస్టమ్స్‌కు పరిమితికి మించి పర్మీ షన్లు ఇవ్వడం వల్ల ఏఐలు రహస్య సమాచారాన్ని సులభంగా యాక్సెస్ చేయగలిగాయి.
ఎంత ప్రమాదకరమంటే?
⇒ ఏఐ ఏజెంట్లు ఇలా అదుపు తప్పడం భవిష్యత్తు సైబర్ భద్రతకు పెద్ద సవాలు.
⇒ మానవ హ్యాకర్లు ఒక సిస్టమ్‌లోని లోపాలను వెతకడానికి రోజులు లేదా వారాల సమయం తీసుకుంటారు. కానీ, ఏఐ ఏజెంట్లు కొద్ది గంటల వ్యవధిలోనే సిస్టమ్ లోపాలను కనిపెట్టి, డేటాను స్కాన్ చేయగలవు.
⇒ సెర్ట్–ఇన్ ప్రకారం... పరిశోధనలో ఉన్న ఏఐలు పక్కదారి పట్టడమే కాకుండా, సైబర్ నేరగాళ్లు కూడా ఓపెన్–సోర్స్ ఏఐ టూల్స్ ఉపయోగించి భారత ఆర్థిక, ఐటీ వ్యవస్థలపై దాడులు చేయడం ప్రారంభించారు.
⇒ నేపథ్యంలో కంపెనీలన్నీ తమ సోర్స్ కోడ్‌లలో ఎక్కడా పాస్‌వర్డ్‌లు, క్లౌడ్ కీలు బయటపడకుండా చూసుకోవాలని సెర్ట్–ఇన్ కీలక ఆదేశాలు ఇచి్చంది. అలాగే ఏఐ డెవలపర్లు తమ టెస్టింగ్‌ను లైవ్ ఇంటర్నెట్‌లో కాకుండా పూర్తిగా ఐసోలేటెడ్ ఎని్వరాన్‌మెంట్‌లో చేయాలని సూచించింది.
భారత్ సంసిద్ధత ఎంత?
⇒ ఏఐ ఏజెంట్ల వల్ల రాబోయే ఆర్థిక,సైబర్ సెక్యూరిటీ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ ముందస్తు వ్యూహాలను సిద్ధంచేస్తోంది.
⇒ దేశంలో ఏఐ ఏజెంట్లు మనుషుల ప్రమేయం లేకుండా డిజిటల్ లావాదేవీలు (ఉదా: ధర తగ్గినప్పుడు కిరాణా సామా న్లు సొంతంగా ఆర్డర్ చేయడం) జరిపే రోజులు దగ్గరపడుతున్నాయి. అందువల్ల, మోసాలను అరికట్టడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ఏఐ ఏజెంట్ల పరిశీలన, పర్యవేక్షణకు ప్రత్యేక‘యూనిఫైడ్ ఏజెంటిక్ ప్రోటోకాల్’ను అభివృద్ధి చేస్తోంది.
⇒ ఏఐ మోడల్స్ అదుపు తప్పకుండా ఉండటానికి ఐరోపా సమాఖ్య, అమెరికా తరహాలోనే భారత్ కూడా కఠినమైన ఏఐ గవర్నెన్స్, సైబర్ సెక్యూరిటీ నిబంధనలను రూపొందిస్తోంది.
⇒ ఏఐకి పూర్తి పర్మీ షన్లు ఇవ్వడం వల్ల దేశ రక్షణ, బ్యాంకింగ్, వ్యక్తిగత డేటా ప్రమాదంలో పడే అవకాశముంది.అందుకే ఇక్కడి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, ఏఐ ల్యాబ్‌లు ఏఐ అలైన్‌మెంట్ రీసెర్చ్‌పై దృష్టి పెడుతున్నాయి.


