breaking news
IT Infrastructure market
-
‘రోగ్ ఏఐ ఏజెంట్ల’ విద్రోహం!
సాక్షి, హైదరాబాద్: మన దేశంలోని పలు సంస్థల లైవ్ కంప్యూటర్ నెట్‌వర్క్‌లలోకి, ఐటీ వ్యవస్థల్లోకి దేశీ/విదేశీ సంస్థల రోగ్ ఏఐ ఏజెంట్లు చొరబడి, రహస్య సమాచారాన్ని, ప్రజల వ్యక్తిగత డేటాను యాక్సెస్ చేశాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ విభాగం ‘సెర్ట్–ఇన్’సంస్థ ‘సైబర్ దాడి సాధనాలుగా ఏఐ ఏజెంట్లు’పేరిట హెచ్చరికను జారీ చేసింది.అసలేం జరిగింది?ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఏఐ మోడల్ తయారీ సంస్థలు (ఓపెన్ ఏఐ, ఆంత్రోపిక్, గూగుల్ వంటివి) ఓపెన్ ఇంటర్నెట్లో తమ సరికొత్త ఏఐ ఏజెంట్లను టెస్టింగ్, రీసెర్చ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఏఐ ఏజెంట్లు తమకు అప్పగించిన పనుల పరిమితులను దాటి ప్రవర్తించాయి. ఇంటర్నెట్ ద్వారా అవి నేరుగా భారత్‌కు చెందిన పలు ప్రభుత్వ/ప్రైవేట్ సంస్థల లైవ్ కంప్యూటర్ సిస్టమ్స్‌లోకి చొరబడినట్టు స్పష్టమైంది. అక్కడున్న వ్యాపార రికార్డులు, రహస్య ఫైళ్లు, వ్యక్తిగత డేటాను చదివినట్టుగా వెల్లడైంది. ఈ విషయాన్ని ప్రభావితమైన భారతీయ సంస్థలు గుర్తించలేకపోయాయి. అయితే, ఈ ఏఐ మోడళ్లను తయారు చేసిన కంపెనీలు తమ అంతర్గత ఆడిట్లో ఈ తప్పును కనుగొని, స్వచ్ఛందంగా ’సెర్ట్–ఇన్’కు రిపోర్ట్ చేయడంతో ఇది వెలుగులోకి వచి్చంది. ఎలా ప్రవేశించాయి?⇒ ఏఐ ఏజెంట్లు ఎలాంటి సంక్లిష్టమైన హ్యాకింగ్ ట్రిక్స్ ఉపయోగించలేదు. భారతీయ సంస్థలు చేసిన సాధారణ సైబర్ భద్రతా లోపాలనే అవి వాడుకున్నాయి. ⇒ యాప్ కాని్ఫగరేషన్లలో, పబ్లిక్ కోడ్ రిపోజిటరీలలో ఉద్యోగులు పొరపాటున వదిలేసిన యూజర్‌నేమ్‌లు, పాస్వర్డ్లు, ఏపీఐ కీలను ఈ ఏఐలు గుర్తించి చొరబడ్డాయి. ⇒ క్లౌడ్ స్టోరేజ్ సిస్టమ్స్‌కు పరిమితికి మించి పర్మీ షన్లు ఇవ్వడం వల్ల ఏఐలు రహస్య సమాచారాన్ని సులభంగా యాక్సెస్ చేయగలిగాయి.ఎంత ప్రమాదకరమంటే?⇒ ఏఐ ఏజెంట్లు ఇలా అదుపు తప్పడం భవిష్యత్తు సైబర్ భద్రతకు పెద్ద సవాలు. ⇒ మానవ హ్యాకర్లు ఒక సిస్టమ్‌లోని లోపాలను వెతకడానికి రోజులు లేదా వారాల సమయం తీసుకుంటారు. కానీ, ఏఐ ఏజెంట్లు కొద్ది గంటల వ్యవధిలోనే సిస్టమ్ లోపాలను కనిపెట్టి, డేటాను స్కాన్ చేయగలవు. ⇒ సెర్ట్–ఇన్ ప్రకారం... పరిశోధనలో ఉన్న ఏఐలు పక్కదారి పట్టడమే కాకుండా, సైబర్ నేరగాళ్లు కూడా ఓపెన్–సోర్స్ ఏఐ టూల్స్ ఉపయోగించి భారత ఆర్థిక, ఐటీ వ్యవస్థలపై దాడులు చేయడం ప్రారంభించారు. ⇒ నేపథ్యంలో కంపెనీలన్నీ తమ సోర్స్ కోడ్లలో ఎక్కడా పాస్వర్డ్లు, క్లౌడ్ కీలు బయటపడకుండా చూసుకోవాలని సెర్ట్–ఇన్ కీలక ఆదేశాలు ఇచి్చంది. అలాగే ఏఐ డెవలపర్లు తమ టెస్టింగ్‌ను లైవ్ ఇంటర్నెట్లో కాకుండా పూర్తిగా ఐసోలేటెడ్ ఎని్వరాన్మెంట్లో చేయాలని సూచించింది.భారత్ సంసిద్ధత ఎంత? ⇒ ఏఐ ఏజెంట్ల వల్ల రాబోయే ఆర్థిక,సైబర్ సెక్యూరిటీ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ ముందస్తు వ్యూహాలను సిద్ధంచేస్తోంది. ⇒ దేశంలో ఏఐ ఏజెంట్లు మనుషుల ప్రమేయం లేకుండా డిజిటల్ లావాదేవీలు (ఉదా: ధర తగ్గినప్పుడు కిరాణా సామా న్లు సొంతంగా ఆర్డర్ చేయడం) జరిపే రోజులు దగ్గరపడుతున్నాయి. అందువల్ల, మోసాలను అరికట్టడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఏఐ ఏజెంట్ల పరిశీలన, పర్యవేక్షణకు ప్రత్యేక‘యూనిఫైడ్ ఏజెంటిక్ ప్రోటోకాల్’ను అభివృద్ధి చేస్తోంది. ⇒ ఏఐ మోడల్స్ అదుపు తప్పకుండా ఉండటానికి ఐరోపా సమాఖ్య, అమెరికా తరహాలోనే భారత్ కూడా కఠినమైన ఏఐ గవర్నెన్స్, సైబర్ సెక్యూరిటీ నిబంధనలను రూపొందిస్తోంది. ⇒ ఏఐకి పూర్తి పర్మీ షన్లు ఇవ్వడం వల్ల దేశ రక్షణ, బ్యాంకింగ్, వ్యక్తిగత డేటా ప్రమాదంలో పడే అవకాశముంది.అందుకే ఇక్కడి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, ఏఐ ల్యాబ్‌లు ఏఐ అలైన్మెంట్ రీసెర్చ్‌పై దృష్టి పెడుతున్నాయి. -
టాటా కంపెనీపై సైబర్ దాడి కలకలం
న్యూఢిల్లీ: విద్యుత్ రంగ సంస్థ టాటా పవర్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) మౌలిక సదుపాయాలు .. సైబర్ దాడికి గురయ్యాయి. దీంతో కొన్ని ఐటీ సిస్టమ్స్‌పై ప్రభావం పడిందని స్టాక్ ఎక్సే్చంజీలకు ఇచ్చిన సమాచారంలో కంపెనీ తెలిపింది. సిస్టమ్స్‌ను పునరుద్ధరించడానికి అన్ని చర్యలు తీసుకున్నట్లు వివరించింది. కీలకమైన అన్ని సిస్టమ్‌లు యథాప్రకారం పని చేస్తున్నాయని, అయితే ముందు జాగ్రత్త చర్యగా ఉద్యోగులు, కస్టమర్లు వినియోగించే పోర్టల్స్, టచ్ పాయింట్లపై కొన్ని పరిమితులు అమలు చేస్తున్నట్లు పేర్కొంది. -
2 బిలియన్ డాలర్లకు దేశీ ఐటీ ఇన్ఫ్రా మార్కెట్!
న్యూఢిల్లీ: దేశీ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్కెట్ ఈ ఏడాది స్వల్ప వృద్ధితో 1.93 బిలియన్ డాలర్లకు చేరుతుందని రీసెర్చ్ సంస్థ గార్ట్నర్ అంచనా వేసింది. ఇది 2020 నాటికి 2.13 బిలియన్ డాలర్లకు చేరవచ్చని అభిప్రాయపడింది. కాగా గతేడాది ఈ మార్కెట్ 1.9 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు పేర్కొంది. సర్వర్లు, స్టోరేజ్, ఎంటర్ప్రైజ్ నెట్వర్కింగ్ ఉపకరణాలన్నీ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్కెట్ పరిధిలోకి వస్తాయి. భారతీయ కంపెనీలు డిజిటల్ బిజినెస్ సవాళ్లను ఎదుర్కోడానికి అనువుగా నెక్ట్స్ జనరేషన్ డేటా సెంటర్లు ఏర్పాటుపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించామని గార్ట్నర్ రీసెర్చ్ డెరైక్టర్ నవీన్ మిశ్రా తెలిపారు. దేశీ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్కెట్ వృద్ధిలో ఎంటర్ప్రైజ్ నెట్వర్కింగ్ ప్రధాన పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.


