మునుగోడు ధర్మయుద్ధంలో  విజయం నాదే: రాజగోపాల్‌రెడ్డి

Iam going to win munugode bypoll komatireddy Raj Gopal Reddy - Sakshi

సంస్థాన్‌ నారాయణపురం: మునుగోడులో జరిగే ధర్మ యుద్ధంలో తన విజయం తథ్యం అని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. ప్రజాసేవకు తాను ఆస్తులు అమ్ముకుంటే.. మంత్రి జగదీశ్‌రెడ్డి పద విని అడ్డంపెట్టుకుని రూ.వేల కోట్ల ఆస్తులు సంపాదించారని ఆరోపించారు. బుధవారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురంలో తన అనుచరులు, అభిమానులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు.

జగదీశ్‌ రెడ్డికి విద్యుత్‌ శాఖకు బదులుగా కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ శాఖను కేటాయిస్తే బాగుంటుందని రాజగోపాల్‌రెడ్డి ఎద్దేవా చేశారు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్‌కు నిధులు తీసుకెళ్తుంటే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అభివృద్ధి పనులకు నిధులు తీసుకురాలేని దద్దమ్మ జగదీశ్‌రెడ్డి అని దుయ్య బట్టారు. ఈనెల 21న మునుగోడులో జరిగే అమిత్‌షా సభలో తనతోపాటు భారీ సంఖ్యలో వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు బీజేపీలో చేరనున్నట్లు రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. అనంతరం తన తల్లి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్‌ ద్వారా పేద కుటుంబాలకు రూ.8 లక్షల ఆర్థికసాయం చేశారు.
చదవండి: చిచ్చుపెట్టే వారితో జాగ్రత్త! మోసపోతే గోసే..

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top