ఖాళీ స్థలంలో ఆడుకుంటుండగా కుప్పకూలిన గోడ.. హైదరాబాద్‌లో విషాదం | Hyderabad: SixYear Old Boy Dies After Wall collapse in Kachiguda | Sakshi
Sakshi News home page

ఖాళీ స్థలంలో ఆడుకుంటుండగా కుప్పకూలిన గోడ.. హైదరాబాద్‌లో విషాదం

Dec 22 2022 9:27 AM | Updated on Dec 22 2022 3:04 PM

Hyderabad: SixYear Old Boy Dies After Wall collapse in Kachiguda - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గోడకూలి ఓ బాలుడు మృతి చెందగా మరో బాలిక తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ సంఘటన కాచిగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బుధవారం జరిగింది. కాచిగూడ ఇన్‌స్పెక్టర్‌ రామ లక్ష్మణ్‌ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌ నుంచి బండి సింగ్, సేవారాజ్‌ కుటుంబాలు  నగరానికి వలస వచ్చి కూలీ పనిచేసుకుంటూ కాచిగూడ, నింబోలిఅడ్డలో నివాలముంటున్నారు.

బండి సింగ్‌ కుమారుడు ధీరూ సింగ్‌ (6), సేవా రాజ్‌ కుమార్తె రాధిక (5) తమ ఇంటి సమీపంలో ఉండే ఖాళీ స్థలంలో ఆడుకుంటుండగా గోడకూలి చిన్నారి ధీరూ సింగ్‌ అక్కడికక్కడే మరణించగా, రాధిక తీవ్రంగా గాయపడింది. రాధికను కాచిగూడలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. బాలికను అక్కడి నుంచి మరింత మెరుగైన వైద్యం కోసం యశోద ఆసుపత్రికి తీసుకువెళ్లినట్లు తెలిపారు.  

నిర్లక్ష్యంగా నిర్మాణం వల్లే.. 
ఖాళీ స్థలానికి అనుకుని పక్కనే ఉన్న స్థలంలో సత్యేందర్‌ నూతనంగా ఇంటి  పిల్లర్ల నిర్మాణం చేపడుతున్నాడు. ఇంటి నిర్మాణం చేపడుతున్న సమయంలో ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా ఇంటి నిర్మాణపు పనులు చేపడుతున్నాడని పోలీసులు తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇంటి యజమాని సత్యేందర్‌పై కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ రామలక్ష్మణ రాజు తెలిపారు. సంఘటన స్థలాన్ని కాచిగూడ పోలీసులు సందర్శించి వివరాల సేకరించారు.  
చదవండి: Hyderabad: ఐటీ కారిడార్‌లో దారుణం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement