హైదరాబాద్‌లో వర్ష బీభత్సం.. ఫోటోలు, వీడియోలు

Hyderabad Rains: Flash floods In Hyderabad, Photos And Videos - Sakshi

 నిండా మునిగిన గ్రేటర్‌ సిటీ

జలమయమైన రహదారులు

ఇళ్లల్లోకి చేరిన వరద నీరు

పలుచోట్ల స్తంభించిన ట్రాఫిక్‌

రాత్రివేళ వణికించిన భారీ వర్షం

సాక్షి, హైదరాబాద్‌: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గ్రేటర్‌ పరిధిలో శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి పొద్దు పోయే వరకు కుండపోతగా జడి వాన కురిసింది. ఉరుములు, మెరుపులు, భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో నగరం నిండా మునిగింది. ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపించాయి. ఈదురుగాలుల బీభత్సానికి పలుచోట్ల చెట్ల కొమ్మలు తెగిపడ్డాయి. విద్యుత్‌ తీగలు తెగి పడడంతో పలుచోట్ల అంధకారం అలుముకుంది. పలు బస్తీలలో ఇళ్లల్లోకి చేరిన వరద నీటితో స్థానికులు అవస్థలు పడ్డారు.


చైతన్యపురి ప్రధాన రహదారిలో

ప్రధాన రహదారులపై రాత్రి 8 నుంచి 11 గంటల వరకు ట్రాఫిక్‌ ఎక్కడికక్కడ స్తంభించింది. దిల్‌సుఖ్‌నగర్‌ పరిధిలోని లింగోజి గూడలో అత్యధికంగా 12.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక రాత్రి 10 గంటల వరకు కుర్మగూడలో 11.7, ఎల్బీనగర్‌ 11, హస్తినాపురంలో 10.8, ఆస్మాన్‌ఘడ్‌ 10.5, విరాట్‌నగర్‌ 10.3,   కంచన్‌బాగ్‌ 10, సర్దార్‌ మహల్‌ 9.9, చందూలాల్‌ బారాదరిలో 9.6, జహానుమా 9.2, రెయిన్‌ బజార్‌ 9.2, శివరాంపల్లి 8.9, అత్తాపూర్‌ 8.1, నాచారం 8.1, రాజేంద్రనగర్‌ 8, భవానీనగర్‌ 7.4, బేగంబజార్‌ 7.2, బతుకమ్మకుంట 7.1, నాంపల్లిలో  7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 


దిల్‌సుఖ్‌నగర్‌లో

►రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధిలో భారీ వర్షానికి ట్రాఫిక్‌ నిలిచిపోయింది. అత్తాపూర్‌ ఆరాంఘర్‌ ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.  
►అప్పా చెరువు నుండి వరద నీరు కర్నూలు జాతీయ రహదారిపై ప్రవహించడంతో శంషాబాద్‌కు వెళ్లే ప్రధాన రహదారిని మూసివేశారు. వాహనాలను హిమాయత్‌ సాగర్‌ మీదుగా మళ్లిస్తున్నారు.  


సాగర్‌ రింగ్‌రోడ్డులో

►కాటేదాన్‌ 33/11 కె.వి సబ్‌స్టేషన్‌ మరోసారి నీటమునిగింది. దీంతో పలు కాలనీలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.  
►సికింద్రాబాద్‌లోని మెట్టుగూడ, వారాసిగూడ, సీతాఫల్‌మండీ, చిలకలగూడ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి వరదనీరు చేరింది. 


ఎల్బీనగర్‌లో

►దిల్‌సుఖ్‌గర్, సరూర్‌నగర్, మలక్‌పేట్, మీర్‌పేట, బడంగ్‌పేటలలో వరదనీరు పోటెత్తింది. ప్రధాన రహదారులు సైతం నీటమునిగాయి. మూడు గంటలపాటు విద్యుత్‌  సరఫరాకు అంతరాయం ఏర్పడింది. హిమాయత్‌ నగర్, నారాయణగూడ, బషీర్‌బాగ్‌ ప్రాంతాల్లోనూ రహదారు లు నీటమునిగి..మ్యాన్‌హోళ్లు పొంగిపొర్లాయి.  
►పాతబస్తీలో వరదనీటిలో ట్రాలీ ఆటోతో పాటు పలు వాహనాలు కొట్టుకుపోయాయి.  


కొత్తపేటలో

వందలాది ఫీడర్లలో నిలిచిన విద్యుత్‌ సరఫరా 
గ్రేటర్‌లో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షానికి విద్యుత్‌ సరఫరా స్తంభించింది. 250కిపైగా ఫీడర్ల పరిధిలో అంతరాయం ఏర్పడటంతో కరెంట్‌ సరఫరా నిలిచిపోయింది. ఎల్బీనగర్, మీర్‌పేట, బడంగ్‌పేట, సంతో‹Ùనగర్, లింగోజిగూడ, హస్తినాపురం, నాగోల్, సరూర్‌నగర్, చంపాపేట, కర్మన్‌ఘాట్, కొత్తపేట, మలక్‌పేట, పాతబస్తీ సహా పలు ప్రాంతాలలో పూర్తిగా విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. రాజేంద్రనగర్, మెహదీపట్నం, అత్తాపూర్, సైదాబాద్, నాంపల్లి, అఫ్జల్‌గంజ్, ఇమ్లీబన్‌ బస్టాండ్‌ పరిసరాల్లో అంధకారం తప్పలేదు.


పాతబస్తీలో ఒకరికొకరు తోడుగా రోడ్డు దాటుతున్న దృశ్యం

చిక్కడపల్లి, నారాయణగూడ, ఉప్పల్, అంబర్‌పేట, సికింద్రాబాద్‌ ఇతర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. ఒకవైపు ఏకధాటిగా కురుస్తున్న వర్షం..మరో వైపు మోకాళ్ల లోతు చేరిన వరద నీటితో ప్రయాణికులు, వీధి దీపాలు వెలగక ఎక్కడ ఏ గుంత ఉందో తెలియక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచి్చంది. పలు చోట్ల గంట నుంచి గంటన్నర పాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోగా.. మరికొన్ని చోట్ల రాత్రి పొద్దుపోయేదాకా కరెంట్‌ సరఫరా లేదు.  


రోడ్డుపై భారీగా చేరిన వరద నీరు

వరంగల్‌ జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ జామ్‌ 
భారీ వర్షానికి ఉప్పల్‌లో రోడ్లపై ఉన్న షటర్లు, షాపుల్లోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో ట్రాఫిక్‌ పోలీసులు రంగ ప్రవేశం చేసి రోడ్లపై డివైడర్లను తొలగించారు. వరంగల్‌ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరడతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. 


పాతబస్తీలోని ఓ హోటల్‌లో.. 

విద్యుత్‌ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి 
అకస్మాత్తుగా కురుస్తున్న భారీ వర్షం, గాలుల నేపథ్యంలో సంస్థ చీఫ్‌ ఇంజినీర్లు, సూపరింటెండింగ్‌ ఇంజినీర్లతో సీఎండీ జి.రఘుమారెడ్డి టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. భారీ గాలుల నేపథ్యంలో చెట్ల కొమ్మలు కూలి విద్యుత్‌ లైన్స్, స్తంభాలు విరిగే అవకాశమున్నందున క్షేత్ర స్థాయి సిబ్బంది విధిగా పెట్రోలింగ్‌ చేయాలని ఆదేశించారు. రాత్రంతా భారీ వర్షం..గాలులు వీచే అవకాశమున్నందున ఎఫ్‌ఓసీ, సీబీడీ సిబ్బంది సబ్‌ స్టేషన్లలో అందుబాటులో ఉండాలన్నారు. విద్యుత్‌ సరఫరాకు సంబంధించి ఎలాంటి అత్యవసర పరిస్థితి వున్నా 1912 / 100 / స్థానిక ఫ్యూజ్‌ ఆఫ్‌ కాల్‌ ఆఫీస్‌తో పాటు విద్యుత్‌ శాఖ ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ 7382072104, 7382072106, 7382071574 నెంబర్లకు ఫోన్‌ చేయాలన్నారు. 


రాంగోపాల్‌పేట నల్లగుట్టలో నీట మునిగిన కాలనీ

విద్యుత్‌ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి 
అకస్మాత్తుగా కురుస్తున్న భారీ వర్షం, గాలుల నేపథ్యంలో సంస్థ చీఫ్‌ ఇంజినీర్లు, సూపరింటెండింగ్‌ ఇంజినీర్లతో సీఎండీ జి.రఘుమారెడ్డి టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. భారీ గాలుల నేపథ్యంలో చెట్ల కొమ్మలు కూలి విద్యుత్‌ లైన్స్, స్తంభాలు విరిగే అవకాశమున్నందున క్షేత్ర స్థాయి సిబ్బంది విధిగా పెట్రోలింగ్‌ చేయాలని ఆదేశించారు. రాత్రంతా భారీ వర్షం..గాలులు వీచే అవకాశమున్నందున ఎఫ్‌ఓసీ, సీబీడీ సిబ్బంది సబ్‌ స్టేషన్లలో అందుబాటులో ఉండాలన్నారు. విద్యుత్‌ సరఫరాకు సంబంధించి ఎలాంటి అత్యవసర పరిస్థితి వున్నా 1912 / 100 / స్థానిక ఫ్యూజ్‌ ఆఫ్‌ కాల్‌ ఆఫీస్‌తో పాటు విద్యుత్‌ శాఖ ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ 7382072104, 7382072106, 7382071574 నెంబర్లకు ఫోన్‌ చేయాలన్నారు. 


రాణిగంజ్‌లో..

పాతబస్తీ అతలాకుతలం 
చార్మినార్‌: పాతబస్తీలో గంటన్నరపాటు దంచికొట్టిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. జనజీవనం స్తంభించింది. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. రోడ్లపై వరద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు నరకయాతన పడ్డారు. చారి్మనార్, మీరాలం మండి, మదీనా, పత్తర్‌ గట్టి, పురానాపూల్‌ తదితర ప్రాంతాల నుంచి సైదాబాద్, మలక్‌పేట, సంతోష్‌ నగర్, డబీర్‌ పురా, చంచల్‌ గూడ, ఈదిబజార్‌ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక్కడ రైల్వే అండర్‌బ్రిడ్జి పూర్తిగా వరదనీటిలో మునిగిపోవడంతో రోడ్లపైనే గంటల తరబడి వాహనదారులు నిలిచిపోయారు. చాంద్రాయణగుట్ట, జంగమ్మెట్, చత్రినాక, పటేల్‌ నగర్, శివాజీ నగర్, శివగంగా నగర్‌ తదితర ప్రాంతాలలో వరద నీరు ఇళ్లలోకి చేరింది. దాదాపు మొదటి అంతస్తు మునిగేంత వరకు వరద నీరు చేరింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top