
రోజురోజుకూ కరోనా పంజా విసురుతుండటంతో అధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అత్యవసరంగా బయటకు వెళ్లాల్సి వస్తే మాస్కులు తప్పని సరిగా వాడాలని హెచ్చరిస్తున్నా.. నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొందరు మాస్కులను నామమాత్రంగా ధరిస్తూ మెడలో వేసుకోగా.. మరికొందరు గొంతుకు వేలాడదీస్తున్నారు. చాలామంది అసలు మాస్కులే ధరించడం లేదు. (అనారోగ్యంతో హోంగార్డు మృతి..)