Passport: ఇక నుంచి వేగంగా పాస్‌పోర్టుల జారీ | Hyderabad: Passport Seva Appointment Slots Increased To Reduce Waiting List | Sakshi
Sakshi News home page

Passport: పాస్‌పోర్టు అపాయింట్‌మెంట్ల పెంపు

Jan 17 2023 6:48 PM | Updated on Jan 17 2023 7:06 PM

Hyderabad: Passport Seva Appointment Slots Increased To Reduce Waiting List - Sakshi

పాస్‌పోర్టు దరఖాస్తుదారులు అపాయింట్‌మెంట్ల కోసం చాలాకాలం నిరీక్షించకుండా మరిన్ని సాధారణ, తత్కాల్‌ అపాయింట్‌మెంట్‌లను పెంచినట్లు...

సాక్షి హైదరాబాద్: పాస్‌పోర్టు దరఖాస్తుదారులు అపాయింట్‌మెంట్ల కోసం చాలాకాలం నిరీక్షించకుండా మరిన్ని సాధారణ, తత్కాల్‌ అపాయింట్‌మెంట్‌లను పెంచినట్లు హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 

బేగంపేట ప్రాంతీయ పాస్‌పోర్టు సేవా కేంద్రంలో సాధారణ పాస్‌పోర్టు అపాయింట్‌మెంట్‌లు 50, తత్కాల్‌ 50, అమీర్‌పేట పీఎస్‌కేలో సాధారణ 25, తత్కాల్‌ 25, టోలిచౌకి పిఎస్‌కెలో సాధారణ 25, తత్కాల్‌ 25, నిజామాబాద్‌ తత్కాల్‌ 20 అపాయింట్‌మెంట్‌లను పెంచినట్లు ఆయన తెలిపారు. పెంచిన అపాయింట్‌మెంట్‌లు 16వ తేది నుంచి అమలులోకి వస్తాయని పేర్కొన్నారు. 

గత డిసెంబర్ మాసంలో 5 ప్రాంతీయ పాస్‌పోర్టు సేవా కేంద్రాలు, 14 పోస్ట్‌ ఆఫీస్‌ పాస్‌పోర్టు సేవా క్రేందాల్లో వరుసగా 4 శనివారాల్లో ప్రత్యేక డ్రైవ్‌ల ద్వారా అపాయింట్‌మెంట్‌ల లభ్యత పెంచినట్లు వివరించారు. దీనివలన గతంలో తత్కాల్‌ అపాయింట్‌మెంట్‌ల లభ్యత సమయం 30 రోజులకు, సాధారణ పాస్‌పోర్టు అపాయింట్‌మెంట్‌ల లభ్యత సమయం 40 రోజులకు తగ్గిందని తెలిపారు. (క్లిక్ చేయండి: ఎఫ్‌ఐఆర్‌లు.. జరిమానాలు..రెడ్‌ నోటీసులు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement