ఇండో జపనీస్‌ బ్రిడ్జ్‌ ఇకెబనా.. ఈసారి ప్రత్యేకం!

Hyderabad Ikebana 2022: Exhibition Japanese art of flower - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇండో జపనీస్‌ దేశాల మధ్య దౌత్య సంబంధాలకు 70 ఏళ్ల పూర్తయిన సందర్భంగా నగరంలోని మాదాపూర్‌లో అద్భుతమైన పూల ప్రదర్శనను ఏర్పాటు చేశారు హైదరాబాద్‌ ఇకెబనా చాప్టర్‌ బృందం. జపాన్‌కు అలంకరణ విధానమై ఇకెబనా... పూలతో అద్భుతమైన కళాఖండాలను ఎలా చేయవచ్చో చెబుతుంది.

 

ఈ ఆర్ట్ ద్వారా పువ్వుల కొమ్మలతో వేర్వేరు రూపాలను తయారు చేసి ప్రదర్శించారు హైదరబాద్ చాప్టర్ ఆఫ్ ఓహర ఇకెబనా. ఇండో  జపనీస్ దేశాల మధ్య స్నేహాన్ని, ఒకరిపై మరొకరి అభిమానాన్ని చాటిచెప్పేలా ముదిత్ మత్సురి థీమ్‌తో ఈ ప్రదర్శన చాప్టర్ సభ్యులు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ జపనీస్ ఫెస్టివల్ లో ఇకెబనా, ఒరిగమి, జపనీస్ మార్షల్ ఆర్ట్స్ ఈ ప్రదర్శనలో చూపించారు. 

మనం జరుపుకునే పండుగల పరమార్థం వచ్చేలా ఈ ప్రదర్శనను తయారు చేశామని హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ నిర్మల అగర్వాల్ తెలిపారు.  ప్రకృతి ఒడిలో జీవించడం అన్నివేళలా సాధ్యం కాదు, కాబట్టి ప్రకృతిని ఇంట్లోకి ఆహ్వానించడం అన్నమాటే ఆర్ట్ అన్నారు మాజీ డిజి జయ చంద్ర. ఇకబన ఆర్ట్‌ ప్రకృతికి దగ్గర చేస్తూ.. ఒక్క పువ్వుతో కూడా ఎంతో అందంగా కళా ఖండాలను తయారు చేయవచ్చని తెలిపారు. వినూత్నంగా ఏర్పాటు చేసిన ఈ ఇకెబనా ఎగ్జిబిషన్ అందరినీ ఆకర్షిస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top