ఎంకి పెళ్లి సుబ్చి చావుకొచ్చిందన్నట్టు.. వారికి సంతోషమే.. కానీ..

Hyderabad: Ghmc Additional Burden Mayor Corporators Honorarium Amount - Sakshi

పెరిగిన మేయర్, కార్పొరేటర్ల వేతనాలు  

ఖజానాపై ఏటా దాదాపు రూ. 34.66 లక్షల అదనపు భారం

సాక్షి, హైదరాబాద్‌: ఎంకి పెళ్లి సుబ్చి చావుకొచ్చిందన్నట్టు.. జీహెచ్‌ఎంసీలోని స్థానిక ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలు పెరగడం వల్ల వారికి సంతోషం కలిగినప్పటికీ, అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్న జీహెచ్‌ఎంసీకి కొంత భారం పెరగనుంది. జీహెచ్‌ఎంసీలో ప్రస్తుతం మేయర్, డిప్యూటీ మేయర్‌ కాక, 148 మంది కార్పొరేటర్లు ఉన్నారు. కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక ఇంకా జరగకపోవడంతో వారు లేరు. ప్రస్తుతం ఉన్నవారిని పరిగణనలోకి తీసుకుంటే మేయర్‌ గౌరవ వేతనం  ఇప్పుడున్న రూ. 50 వేల నుంచి రూ. 65 వేలకు పెరిగింది.

డిప్యూట్‌ మేయర్‌కు రూ.25 వేల నుంచి రూ.32,500, కార్పొరేటర్లకు రూ.6 వేల నుంచి రూ.7,800 లకు పెరిగింది.పెంపును పరిగణనలోకి తీసుకుంటే  కింది విధంగా బల్దియాపై అదనపు భారం పడుతుంది. ఈ పెంపుతో మొత్తం బల్దియా ఖజానాపై ఏడాదికి రూ.34,66,800 భారం పెరిగింది.  

చదవండి: నచ్చిన సబ్జెక్టు.. మెచ్చిన చోట

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top