డ్రైవింగ్ సమయంలో ఇలా చేస్తున్నారా?.. శిక్ష తప్పదు: సజ్జనార్‌ హెచ్చరిక | Hyderabad CP Sajjanar Given Instructions To Vehicle Drivers | Sakshi
Sakshi News home page

డ్రైవింగ్ సమయంలో ఇలా చేస్తున్నారా?.. శిక్ష తప్పదు: సజ్జనార్‌ హెచ్చరిక

Oct 7 2025 10:36 AM | Updated on Oct 7 2025 10:54 AM

Hyderabad CP Sajjanar Given Instructions To Vehicle Drivers

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ సిటీలో వాహనాల డ్రైవర్లకు సీపీ వీసీ సజ్జనార్‌(CP Sajjanar) హెచ్చరికలు జారీ చేశారు. డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్‌లో వీడియోలు చూడటం, ఇయర్‌ ఫోన్లు(Traffic Violations) ఉపయోగించడం నేరమని అన్నారు. ఇది ప్రమాదకరం.. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

హైదరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ తాజాగా ట్విట్టర్‌ వేదికగా.. ఇటీవలి కాలంలో ఆటో, క్యాబ్ డ్రైవర్స్(Cab Drivers), బైక్ టాక్సీలు నడిపేవారు డ్రైవింగ్ సమయంలో తరచుగా మొబైల్ ఫోన్‌లో వీడియోలు చూడటం, ఇయర్‌ఫోన్స్ వినియోగించడం చేస్తున్నారు. ఇలాంటివి చేయడం నేరం. ఇది ప్రమాదకరమైంది.. శిక్షార్హమైన నేరం. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అలాంటి ఉల్లంఘనదారులపై కఠిన చర్యలు తీసుకుంటారు అని హెచ్చరించారు. ఇదే సమయంలో వాహనదారుల స్వీయ రక్షణ, ప్రయాణీకులు, తోటి రోడ్డు వినియోగదారుల భద్రత చాలా ముఖ్యమైనది. ఏ పరధ్యానం కూడా ప్రాణానికి విలువైనది కాదు. ఇలాంటి వాటి దృష్టి పెట్టండి, సురక్షితంగా ఉండండి’ అని సూచించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement