
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలోని సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపు కలకలం రేపింది. కోర్టులో బాంబు పెట్టినట్టు అబీదా అబ్దుల్లా పేరుతో బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో, పోలీసుల తనిఖీలు చేపట్టారు. మరోవైపు.. తాజాగా రాజ్‌భవన్‌కు కూడా బాంబు బెదిరింపు వచ్చినట్టు తెలుస్తోంది. వరుసు బాంబు బెదిరింపుల ఘటనల నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు.
వివరాల ప్రకారం.. సిటీ సివిల్ కోర్టుకు బాంబు పెట్టినట్టు అబీదా అబ్దుల్లా పేరుతో వార్నింగ్ మెయిల్ వచ్చింది. బెదిరింపు మెయిల్ పంపిన ఆగంతకుడు. నాలుగు ఆర్డీఎక్స్ బాంబులు, ఐఈడీలు పెట్టినట్టు మెయిల్ పంపించాడు. సిటీ సివిల్ కోర్టుతో పాటుగా నాలుగు చోట్ల బాంబులు పెట్టినట్టు హెచ్చరిక. సిటీ సివిల్ కోర్టు, జడ్జి చాంబర్స్, జింఖానా క్లబ్, జడ్జి క్వార్టర్స్‌లో బాంబులు అమర్చినట్టు మెయిల్.
కోర్టులో పేలుడు జరిగిన తర్వాత 23 నిమిషాల్లో జింఖానా క్లబ్ పేలిపోతుందంటూ హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో అతడి మెయిల్‌ను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. నాలుగు చోట్ల బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసులు తనిఖీలు చేపట్టారు. బాంబు బెదిరింపు రావడంతో కోర్టు కార్యకలాపాలు నిలిపివేశారు. చీఫ్ మేజిస్ట్రేట్ కోర్టు మూసివేసి తనిఖీలకు అనుమతి ఇచ్చారు. కోర్టు కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేశారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.