
గేయ రచయితలను సన్మానిస్తున్న ఎంపీపీ రవీందర్ యాదవ్ తదితరులు
సాక్షి, కేశంపేట(హైదరాబాద్): యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తున్న ‘బుల్లెట్ బండెక్కి..’ పాటను రాసిన గేయ రచయితలను ఎంపీపీ రవీందర్‌యాదవ్ బుధవారం సన్మానించారు. మండల పరిషత్ కార్యాలయంలో గేయ రచయితలు మండల పరిధిలోని నిర్దవెళ్లి గ్రామానికి చెందిన రాము, లక్ష్మణ్‌లను శాలువలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ వర్కాల లక్ష్మీనారాయణగౌడ్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మురళీధర్‌రెడ్డి పాల్గొన్నారు.