తెలంగాణలో మరో భారీ నిధుల గోల్‌మాల్‌

Huge Money Fraud In Telangana Warehousing Department - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర గిడ్డంగుల సంస్థలో నిధుల గోల్‌మాల్‌కు భారీ కుట్ర జరిగింది. ఫిక్సిడ్‌ డిపా జిట్లు కాజేసేందుకు జరిగిన ప్రయత్నం విఫలమైంది. తెలుగు అకాడమీలో జరిగి న నిధుల గోల్‌మాల్‌ వెనుక ఉన్న సూత్రధారే పాత్రే ఇక్కడా ఉన్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది. తెలుగు అకాడమీలో కోట్ల రూపాయలకు పైగా నిధులను పక్కదారి పట్టించగా, తా జాగా గిడ్డంగుల సంస్థకు చెందిన రూ. 3.98 కోట్లు కాజేసేందుకు కుట్ర పన్నారు. అయితే ఇదే సమయంలో గిడ్డంగుల సంస్థ ఫిక్సిడ్‌ డిపాజిట్‌ చేసి సంవత్సరం కావడంతో విత్‌ డ్రా కో సం అధికారులు బ్యాంకును సంప్రదించగా, అధికారులు ఇచ్చిన రశీదులు నకిలీవని తేలింది. దీంతో గిడ్డంగుల సంస్థ డిపాజిట్లను కాజేసేందుకు కుట్ర జరిగినట్లు బహిర్గతమైంది.  

బ్యాంకుల్లో డిపాజిట్లు...  
రాష్ట్ర గిడ్డంగుల సంస్థ తమకు వచ్చే ఆదాయా న్ని ఖర్చులకు పోను మిగతా మొత్తాన్ని పలు బ్యాంకుల్లో సంస్థ తరఫున ఫిక్సిడ్‌ డిపాజిట్‌ చేస్తుంది. ఇందులో భాగంగానే హైదరా బాద్‌ కార్వాన్‌ ఏరియాలోని యూనియన్‌ బ్యాంక్‌లో గతేడాది జనవరి 6న రూ. 1.90 కోట్లు, 7న మరో 1.90 కోట్లు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసింది. ఈ నెల 6, 7 తేదీలకు ఏడాది కావడంతో డిపాజిట్లను విత్‌ డ్రా చేసుకునేందుకు సంస్థ అధికారులు బ్యాంకును సంప్రదించి, రశీదులు చూపించగా అవి నకిలీవని బ్యాంకు అధికారులు చెప్పారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆన్‌లైన్‌ వివరాలను బ్యాంకు అధికారులకు చూపించారు. పరిశీలించిన బ్యాంకు నకిలీ రశీదు స్థానంలో మరో రశీదును అందించి, అనంతరం నిధులను సంస్థ ఖాతాలో వడ్డీతో కలిపి జమచేశారు.  

అదే బ్యాంకులో అకాడమీ గోల్‌మాల్‌  
తెలుగు అకాడమీ నిధుల వ్యవహరం, గిడ్డంగుల సంస్థ వ్యవహారం రెండూ కార్వాన్‌ ఏరియాలోని యూనియన్‌ బ్యాంకులోనే జరగడంతో నిధుల గోల్‌మాల్‌లో గత అధికారి పాత్ర ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గిడ్డంగుల సంస్థ బ్యాంకులో నగదును డిపాజిట్‌ చేసిన సమయంలో తెలుగు అకాడమీ నిధులను కాజేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్యాంకు అధికారే ఉండడం కూడా ఇందుకు బలం చేకూరుస్తుంది. ఇందుకు సంబంధించి ఈ కోణంలోనూ పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top