
హైదరాబాద్: తెలంగాణలో మద్యం అమ్మకాలు మరోసారి రికార్డు స్థాయికి చేరాయి. దసరా పండుగ సందర్భంగా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. ప్రధానంగా సెప్టెంబర్ 30, అక్టోబర్ ఒకటవ తేదీల్లో మద్యం కొనుగోళ్లు భారీగా పెరిగాయి. ఈ రెండు రోజుల్లో దాదాపు రూ.419 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి.
ఇందులో సెప్టెంబర్ 30వ తేదీన రూ. 333 కోట్ల మద్యాన్ని మందుబాబులు కొనుగోలు చేయగా, అక్టోబర్ 1వ తేదీన రూ. 86 కోట్ల మద్యం సేల్స్ జరిగాయి సాధారణ రోజులతో పోలిస్తే సెప్టెంబర్ 26 నుంచి మద్యం అమ్మకాలు రెట్టింపు అయ్యాయి అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా మద్యం అమ్మకాలతోపాటు మాంసం దుకాణాలు కూడా బంద్ కావడంతో మళ్లీ శుక్రవారం నుంచి మద్యం విక్రయాలు ఊపందుకున్నాయి. ఈ ఒక్కరోజు రూ. 300 కోట్ల మద్యం బిజినెస్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి:
నా స్థానంలో పోటీ చేసేది ఎవరంటే?.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు