శివాలయం బావిలో 4 నెలల నుంచి వేడి నీళ్లు.. దేవుడి మహిమేనా? | Sakshi
Sakshi News home page

శివాలయం బావిలో 4 నెలల నుంచి వేడి నీళ్లు.. దేవుడి మహిమేనా?

Published Mon, Nov 29 2021 4:02 AM

Hot Water In The Well Of Shiva Temple In Mahabubabad District - Sakshi

సాక్షి, కేసముద్రం(మహబూబాబాద్‌): పురాతన శివాలయంలోని చేదబావిలో నీళ్లు వేడెక్కడంతో ప్రజలు పూజలు చేసిన ఘటన మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తిలో ఆదివారం చోటుచేసుకుంది. కాకతీయుల కాలంలో గ్రామంలో శివాలయం, ఆలయ ఆవరణలో చేదబావిని రాతికట్టడంతో నిర్మించారు. నిత్యం ఆలయాన్ని శుభ్రం చేసేందుకు వెలిశాల సుగుణమ్మ ఈ బావి నీటినే వినియోగిస్తోంది. ఈ క్రమంలో నాలుగు నెలల క్రితం ఎప్పటిలాగే బావిలో నీటిని తోడగా.. నీళ్లు బాగావేడిగా ఉండటం గమనించింది.

వాటిని ఆలయ ఆవరణలోని పోసి చూడగా పొగలు వచ్చినట్లు తెలిపింది. ఈ విషయాన్ని స్థానికులకు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. ఇటీవల కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయానికి వచ్చిన పూజారికి చెప్పింది. బావిలో నీరు వేడిగా ఉన్నట్లు గుర్తించిన ఆయన గ్రామపెద్దలకు సమాచారవిచ్చారు. ఒకట్రెండు రోజుల క్రితం విషయం గ్రామస్తులకు తెలియడంతో ఇదంతా దేవుడి మహిమంటూ ఆదివారం ఆలయానికి చేరుకుని బావి వద్ద పూజలు చేశారు.
చదవండి: రోగికి ఊపిరి పోస్తుండగా... ఆగిన డాక్టర్‌ గుండె

చుట్టుపక్కలున్న బావిలోని నీటిని, ఈ బావి నీటిని పరిశీలించగా తేడా ఉన్నట్లు గ్రామస్తులు గుర్తించారు. భూగర్భంలోని పొరల్లో మార్పుల కారణంగా ఇలా జరిగి ఉండొచ్చని, ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి శాస్త్రవేత్తలతో పరిశీలించాలని పలువురు కోరుతున్నారు.  
చదవండి: సినిమా చూసి.. శవాన్ని ముక్కలుచేసి.. 

Advertisement

తప్పక చదవండి

Advertisement