వ‌ర‌ద‌నీరు ఆసుప‌త్రిలో చేర‌కుండా చ‌ర్య‌లు తీసుకోండి | High Court Directed Govt To Take Steps To Prevent Flood Water | Sakshi
Sakshi News home page

ప్ర‌భుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు

Oct 19 2020 3:48 PM | Updated on Oct 19 2020 4:17 PM

High Court Directed Govt To Take Steps To Prevent Flood Water - Sakshi

హైద‌రాబాద్ : ఉస్మానియా ఆస్పత్రిలో వరద నీరు చేరకుండా చర్యలు తీసుకోవాలని  హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఉస్మానియా ఆస్పత్రిలో వరద నీరు, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదన్న పిల్‌పై నేడు హైకోర్టులో విచారణ జ‌రిగింది. వర్షం నీరు బయటకు వెళ్లే ఏర్పాట్లు సరిగా లేక ఆస్పత్రిలో నీరు నిండుతొంద‌ని  పిటిషనర్ పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా ఉస్మానియా ఆస్పత్రిలో వర్షం  నీరు మూసీలో కలిసేలా ఏర్పాట్లు చేయాలని హైకోర్టు ఆదేశించింది. గతంలో భారీ వర్షాలు కురిసినప్పుడు రోగులు ఇబ్బంది పడ్డారని  హైకోర్టు  ప్రస్తావించింది.  మరో వారం, పది రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. తదుపరి విచారణను  నవంబరు 12కి వాయిదా వేసింది. (‘హైదరాబాద్‌లో అత్యధిక వర్షం, ఇది రెండోసారి’ )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement