కూల్ డ్రింక్ అనుకుని గడ్డిమందు తాగిన బాలుడు | Herbicide Medicine incident in Khammam | Sakshi
Sakshi News home page

కూల్ డ్రింక్ అనుకుని గడ్డిమందు తాగిన బాలుడు

Jun 30 2025 12:34 PM | Updated on Jun 30 2025 1:19 PM

Herbicide Medicine incident in Khammam

కరకగూడెం: కూల్ డ్రింక్ అనుకుని ఓ బాలుడు గడ్డిమందు తాగిన ఘటన మండలంలోని చొప్పల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జాడి నవీన్‌ – వరలక్ష్మి దంపతుల కుమారుడు ఐదేళ్ల వరుణ్‌తేజ ఆదివా రం ఉదయం ఇంట్లో ఆడుకుంటుండగా.. థమ్సప్‌ బాటిల్‌లో పోసిన గడ్డిమందు కనిపించింది. 

అయితే దాన్ని కూల్ డ్రింక్ గా భావించిన బాలుడు కొంత తాగాడు. కాసేపటికి కడుపునొప్పితో బాధపడడంతో నోరు వెంట నురగలు వస్తూ వాంతి చేసుకున్నాడు. వెంటనే తల్లిదండ్రులు ఆటోలో కరకగూడెం పీహెచ్‌సీకి, అక్కడి నుంచి 108 ద్వారా మణుగూరు, భద్రాచలం, కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రులకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు ఖమ్మం తరలించారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

 

Advertisement
 
Advertisement
Advertisement