టోల్‌ ప్లాజాకు ‘పండుగ’

Heavy Vehicles Rush At Panthangi Toll Plaza For Sankranti - Sakshi

పంతంగి టోల్‌ప్లాజా నుంచి రికార్డు స్థాయిలో వాహనాల రాకపోకలు

జాతీయ రహదారి విస్తరణ తర్వాత ఇదే ప్రథమం 

12వ తేదీన 56,595, 13న 67,577 వాహనాల రాకపోకలు 

చౌటుప్పల్‌: సంక్రాంతి పండుగ నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని హైదరాబాద్‌ – విజయవాడ జాతీయ రహదారి రద్దీగా మారింది. హైదరాబాద్‌ జంటనగరాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి మూడు రోజులు గా పెద్ద ఎత్తున ప్రజలు తమ స్వగ్రామాలకు తరలివెళుతు న్నారు. ఈ క్రమంలో చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌ప్లాజా నుంచి రికార్డు స్థాయిలో వాహనాలు వెళ్లాయి.

12వ తేదీన ఇరువైపులా 56,595 వాహనాలు రాకపోకలు సాగించాయి. ఇందు లో కార్లు 42,844, ఆర్టీసీ బ స్సులు 1,300, ప్రైవేట్‌ బస్సు లు 4,913, గూడ్స్‌ వాహనాలు 7,538 ఉన్నాయి. 13వ తేదీన 67,577 వాహనాలు ఇరుమార్గాల్లో వెళ్లాయి. ఇందులో కార్లు 53,561, ఆర్టీసీ బస్సులు 1,851, ప్రైవేట్‌ బస్సులు 4,906, అలాగే 7,259 గూడ్స్, ఇతర వాహనాలు రాకపోకలు సాగించాయి.

11 ఏళ్లలో ఇదే మొదటిసారి: హైదరాబాద్‌ – విజయవాడ జాతీయ రహదారిని 4 వరుసలుగా మార్చిన తర్వాత 11 ఏళ్ల కాలంలో ఒక్క రోజులో ఇంత పెద్ద సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగించడం ఇదే మొదటిసారని అంటున్నారు. సాధారణ రోజుల్లో పంతంగి టోల్‌ప్లాజా నుంచి రోజుకు 30 వేల నుంచి 40 వేల వరకు వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ముందస్తు జాగ్రత్తలు: సంక్రాంతి పండుగకు ఈ రహదారిగుండా పెద్ద సంఖ్యలో ప్రజానీకం వెళ్తుండటంతో పోలీసులు, జీఎమ్మార్‌ అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పంతంగి టోల్‌ప్లాజా, గ్రామాల కూడళ్ల వద్ద ప్రత్యేక సిబ్బందిని నియమించారు.  

మరిన్ని వార్తలు :

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top