Haritha Haram: ప్రతీ ఇంటికి ఆరు మొక్కలు.. నిర్లక్ష్యం చూపితే చర్యలు..

Haritha Haram Programme In Telangana - Sakshi

సాక్షి, సిరిసిల్ల: ఏడో విడత హరితహారంలో భాగంగా ప్రతీ ఇంటికి ఆరు మొక్కలు అందించాలని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ ఆదేశించారు. సిరిసిల్ల కలెక్టరేట్‌ నుంచి జెడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, జిల్లా అధి కారులతో కలిసి అన్ని మండలాల అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పల్లెప్రగతిని జూలై 1 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించాలన్నారు. ప్రతీ మండల కేంద్రంలో పది ఎకరాల్లో పల్లె ప్రకృతివనం నిర్మించేందుకు స్థలం సేకరించాలని తహసీల్దార్లను ఆదేశించారు. పల్లెల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని, నీటిట్యాంకులను శుభ్రం చేయాలని సూచించారు. బాధ్యతగా పనిచేయాలని, నిర్లక్ష్యం చూపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అంతర్గత రోడ్లు, ప్రధాన రోడ్ల వెంట మొక్కలు నాటాలని సూచించారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా మురికినీరు నిల్వ ఉండకుండా చూడాలని సూచించారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ మాట్లాడుతూ పల్లెల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పల్లె ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలిన కోరారు. అదనపు కలెక్టర్‌ సత్యప్రసాద్, జెడ్పీ సీఈవో గౌతమ్‌రెడ్డి, జెడ్పీ వైస్‌చైర్మన్‌ సిద్ధం వేణు, డీఆర్‌డీవో కౌటిల్యరెడ్డి, డీపీవో రవీందర్, పీఆర్‌ ఈఈ శ్రీనివాస్‌రావు, ఏడీవో రణధీర్‌కుమార్, ఆర్టీవో కొండల్‌రావు, అడిషనల్‌ డీఆర్‌డీవో మదన్‌మోహన్‌ తదితరులు పాల్గొన్నారు. 

హరితహారం పోస్టర్ల ఆవిష్కరణ
జిల్లాలో పల్లెప్రగతిని పండుగలా నిర్వహించాలని జెడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ కోరారు. కలెక్టరేట్‌లో సోమవారం హరితహారం పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. పల్లెప్రగతిని సామాజిక బాధ్యతగా నిర్వహించాలని కోరారు.  

చదవండి: నేడు గొల్లపూడిలో దిశ యాప్‌ అవగాహన సదస్సు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top