బ్యాంకర్లతో మంత్రి హరీష్‌ సమీక్ష.. రుణమాఫీలపై కీలక ఆదేశం! | Sakshi
Sakshi News home page

బ్యాంకర్లతో మంత్రి హరీష్‌ సమీక్ష.. రుణమాఫీలపై కీలక ఆదేశం!

Published Mon, Sep 4 2023 6:09 PM

Harish Rao Meeting With Bankers On Farmers Loan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో రుణమాఫీ విషయంలో రైతులకు గుడ్‌న్యూస్‌ చెప్పే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో రైతుల రుణమాఫీపై ఆర్థికమంత్రి హరీష్‌ రావు బ్యాంకర్లతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సీఎస్‌ శాంతి కుమారి, వివిధ బ్యాంకుల అధికారులు హాజరయ్యారు. 

వివరాల ప్రకారం.. తెలంగాణలో​ రైతుల రుణమాఫీపై మంత్రి హరీష్‌ రావు మరోసారి అధికారులతో భేటీ అయ్యారు. అయితే, తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే లక్ష(99,999)రూపాయలలోపు రైతుల రుణాలను మాఫీ చేశారు. ఈ సందర్బంగా రుణాలు మాఫీ కాని రైతులపై ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరికీ రుణమాఫీ అందేలా చూడాలని మంత్రి హరీష్‌ ఆదేశించారు. అలాగే, రుణమాఫీ పొందే రైతులు సమస్యలు చెప్పుకునేలా ఆయా బ్యాంకులు కూడా టోల్‌ఫ్రీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 

ఇదిలా ఉండగా.. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.99,999 వరకు రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీ పూర్తి చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. సీఎం కేసీఆర్​ ఆదేశాలు మేరకు.. 10.79 లక్షల రైతులకు.. రూ.6,546 కోట్ల రుణాలు మాఫీ చేసినట్లు ప్రకటించింది. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి.. ప్రతి వారం కొంత మొత్తాన్ని జమ చేస్తోన్న రాష్ట్ర సర్కార్.. ఖజానాకు వస్తోన్న ఆదాయం ప్రకారం చెల్లింపులు చేస్తోంది. ఈ మేరకు పన్నేతర ఆదాయంపై కూడా దృష్టి సారించింది. ఏది ఏమైనా సెప్టెంబర్​ రెండో వారంలోగా.. ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఇది కూడా చదవండి: ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే మధ్య కోల్డ్‌వార్‌!


 

Advertisement
Advertisement